తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సతీష్‌చంద్ర శర్మను నియమిస్తూ కొలీజియం తన సిఫార్సులను రాష్ట్రపతి కోవింద్‌కు పంపింది.
ప్రస్తుతం తెలంగాణకు తాత్కాలిక సీజేగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు కొనసాగుతున్నారు. అంతకు ముందు హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ సతీశ్‌చంద్రశర్మను నియమిస్తూ సిఫార్సు చేశారు.
ఇదిలా ఉండగా ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ఏకే గోస్వామిని ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఛత్తీస్‌గఢ్ సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను నియమించాలని కొలీజియం సూచించింది.
గత ఏడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై దేశ వ్యాప్తంగా పలువురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను బదిలీ చేసింది. ఇందులో భాగంగా ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు బదిలీ చేసింది.
ఆయన స్థానంలో అక్కడి నుంచి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. కేవలం 8 కాలంలోనే తిరిగి ఆయన బదిలీ కావడం విశేషం. మూడు రాజధానుల పిటిషన్లపై ఇటీవల విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బదిలీతో మళ్లీ వ్యవహారం మొదటికి రానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.