cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: మేస్ట్రో

మూవీ రివ్యూ: మేస్ట్రో

టైటిల్: మేస్ట్రో
రేటింగ్: 2.5/5
తారాగణం: నితిన్, తమన్నా, నభ నటేష్, నరేష్, జిషు సేన్ గుప్తా, హర్షవర్ధన్, రచ్చ రవి, మంగ్లి తదితరులు 
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటింగ్: ఎస్సార్ శేఖర్
కెమెరా: జె. యువరాజ్
నిర్మాత: సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి
దర్శకత్వం: మేర్లపాక గాంధి
విడుదల తేదీ: 17 సెప్టెంబర్ 2021
ఓటీటీ: డిస్నీ హాట్ స్టార్

మూడేళ్ల క్రితం హిందీలో వచ్చిన "అంధాధున్" ని యథాతథంగా తిరిగితీసిన చిత్రం ఈ "మేస్ట్రో". సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ జానర్ లో ఒరిజినల్ వెర్షన్ చాలామంది ప్రేక్షకుల మెప్పు పొందింది. కరోనా వేవ్ ల వల్ల వాయిదా పడుతూ ఈ రోజు విదుదలైన తెలుగు వెర్షన్ ఎలా ఉందో చూద్దాం. 

అరుణ్ (నితిన్) ఒక ట్యాలెంటెడ్ పియానో ప్లేయర్. కానీ అతను గుడ్డి వాడిగా నటిస్తుంటాడు. ఒక హోటల్లో పియానో వాయిస్తే వచ్చే టిప్స్ మీద బతుకుతుంటాడు. 

మోహన్ (నరేష్) అనే ఒక మాజీ సినిమా హీరో తన ఇంట్లో భార్య సిమ్రన్ (తమన్నా) కి సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్రైవేట్ కచ్చేరీ కోసం అరుణ్ ని పిలుస్తాడు. 

చెప్పిన సమయానికి మోహన్ ఇంటికి వస్తాడు అరుణ్. సిమ్రన్ అతనిని రిసీవ్ చేసుకుంటుంది. ఆ ఇంట్లో మోహన్ రక్తపు మడుగులో చనిపోయి ఉంటాడు. అది చూసి షాక్ అవుతాడు అరుణ్. కానీ షాక్ ని వ్యక్తపరచడు. అదే ఫ్లాట్ లో మరొక వ్యక్తి (జిషు సేన్ గుప్త) ని కూడా చూస్తాడు అరుణ్. కానీ తనకి కళ్లు కనపడతాయన్న విషయం తెలియకుండా ఉండడం కోసం గుడ్డి వాడిగా నటిస్తూ ఏమీ చూడనట్టే ఉంటాడు. 

అక్కడి నుంచి బయటికొచ్చాక కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ కి వెళతాడు. అక్కడ ఇన్స్పెక్టర్ గా ఉన్నది తాను సిమ్రన్ తో పాటూ చూసిన వ్యక్తే. అక్కడి నుంచి ఏమౌతుందనేది తర్వాతి కథ. 

ఈ కథలో మంచివాళ్లనేవాళ్లు ఉండరు. హీరోతో సహా అందరూ మోసగాళ్లే. మనిషిలోని కామం, దురాశ, దొరికిపోతామనే భయం ఎన్ని తప్పులు చేయిస్తుందో చూపించే కథ ఇది. 

వీలైనన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా కూడా అసక్తికరమైన కథనం కావడం ఎక్కడా డ్రాప్ కనపడదు. 

కథపరంగా అంతా ఒరిజినల్లే. కథనం కూడా అదే. కనిపించే తేడా భాష, ఆర్టిస్టుల పర్ఫామెన్స్. 

హిందీలో టబు చేసిన పాత్రని ఇక్కడ తమన్నా చేసింది. తనకన్నా 15 ఏళ్లు ఎక్కువ వయసున్న మాజీ హీరోని పెళ్లిచేసుకునే పాత్ర. అయితే టబు ఈ పాత్ర పోషించడంలో చూపించిన బిగువు తమన్నా పనితనంలో కనపడలేదు. ఈ సమస్య ఒరిజినల్ చూసినవాళ్లది మాత్రమే. చూడకపోతే కంపేర్ చేయడానికి ఏమీ ఉండదు కాబట్టి సమస్య లేకపోవచ్చు.

నితిన్ మాత్రం గుడ్డివాడి నటన బాగా చేసాడు. అఫ్ కోర్స్ ఆయుష్మాన్ ఖురానా బాడీ లాంగ్వేజ్ ని యాజిటీజుగా దింపేసాడు. 

ప్రియురాలిగా నటించిన నభ నటేష్ మాత్రం తేలిపోయింది. పాత్రకి ఎలాగూ ప్రాధాన్యం లేదు..కనీసం లుక్స్ పరంగా అయినా అరెస్ట్ చేసే విధంగా లేదు. మేకప్ వగైరాలు తోడ్పడలేదు. 

ఇన్స్పెక్టర్ గా జిషు సేన్ గుప్తా, అతని ఎమోషనల్ భార్యగా శ్రీముఖి సరిపోయారు. 

మాజీ సినీ హీరో మోహన్ పాత్రలో నరేష్ ఒదిగిపోయాడు. అయితే నరేష్ నటించిన "జంబలకిడిపంబ", "నాలుగు స్థంభాలాట" లాంటి పోస్టర్లు చూపిస్తూ, "చినుకులా రాలి" పాట పియానో మీద ప్లే చేసి అది తనకి ఎంతో ఇష్టమైన పాట అని చెబుతూ ఆ పాత్ర పేరు మాత్రం మోహన్ అని పెట్టారు. నరేష్ అని పెట్టేస్తే సరిపోయేదేమో. పూర్తి రియల్ లైఫ్ క్యారెక్టర్ తో ఫిక్షన్ లో నటించడం ఒక వెరైటీ అయ్యుండేది. 

ప్రముఖ గాయని మంగ్లీ లాటరీ టికెట్స్ అమ్మే పాత్రలో ఓకే అనిపించింది. ఆమెలో స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు ఈజ్ ఉంది. మరిన్ని కేరక్టర్స్ చేయొచ్చు. 

పాటలు, సంగీతం సో సో గానే ఉన్నాయి. యువరాజ్ కెమెరా వర్క్ ఒరిజినల్ కి తగ్గట్టుగా ఉంది. ఇతర సాంకేతిక, నిర్మాణ విలువులన్నీ ఓకే. 

అంధాధున్ చూసిన వాళ్లని ఈ మేస్ట్రో రంజింపజేయడానికి ప్రత్యేక అంశాలేవీ లేవు. చూడని వారికి మాత్రం ఇదొక వెరైటీ సినిమాగా అనిపిస్తుంది. 

ఎంత ఫ్రేం టు ఫ్రేం కాపీ కొట్టి తీసినా ఆర్టిస్టుల టైమింగ్ వల్లనో, నటన కారణంగానో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూలానో ఒరిజినల్లో ఉండే గ్రిప్ యథాతథంగా తెరమీదకి ఎక్కదు. ఎక్కడో ఏదో ఒకటి తన్నే ప్రమాదాలుంటాయి. ఇక్కడ అలాంటివి కొన్ని జరిగాయి. 

ఏది ఏమైనా ఇలాంటి సినిమాలు నితిన్ గతంలో ఎప్పుడూ చెయ్యలేదు. విలన్ పాత్రలో తమన్నా కూడా ఇంతకు ముందెప్పుడూ కనిపించలేదు. రొటీన్ చిత్రాలు కాకుండా వెరైటీ ఇష్టపడే ఆడియన్స్ కి ఇది నచ్చొచ్చు. కనుక టైంపాస్ కోసం తీరుబడిగా చూడొచ్చు. 

బాటం లైన్: విసిగించదు- మైమరిపించదు

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×