హమ్మయ్య.. అనుష్క వచ్చేసింది

నిన్నటివరకు అనుష్క రాలేదన్నారు. ఆమెకు ఏమైందంటూ కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు అనుష్క బయటకొచ్చింది. ఆమె ప్రస్తుతం ఎలా ఉందో ప్రేక్షకులు చూడగలిగారు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రచారంలో భాగంగా అనుష్క క్లిప్…

నిన్నటివరకు అనుష్క రాలేదన్నారు. ఆమెకు ఏమైందంటూ కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు అనుష్క బయటకొచ్చింది. ఆమె ప్రస్తుతం ఎలా ఉందో ప్రేక్షకులు చూడగలిగారు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రచారంలో భాగంగా అనుష్క క్లిప్ రిలీజ్ చేశారు.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు సంబంధించి కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా ఓ షో కేటాయించారు. ఈ గురువారం, ఏపీ,నైజాంలో కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా ఓ షో వేస్తున్నారు. ఆ విషయాన్ని వెల్లడించేందుకు అనుష్కతో నిమిషం నిడివి ఉన్న వీడియోను విడుదల చేశారు.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు సంబంధించి అనుష్క బయటకు రావడం ఇదే తొలిసారి. బహుశా, ఈ సినిమా ప్రచారానికి సంబంధించి అనుష్క నుంచి వచ్చిన ప్రమోషనల్ క్లిప్ మొదటిది, చివరిది ఇదే కావొచ్చు. సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ఈ వీడియోలో థ్యాంక్స్ చెప్పింది అనుష్క

సినిమా ప్రమోషన్ లో కేవలం నవీన్ పొలిశెట్టి మాత్రమే పాల్గొన్నాడు. అదిగో అనుష్క వస్తోంది.. ఇదిగో వస్తోంది అంటూ రోజులు గడిపేశారు మేకర్స్. చివరికి సినిమా రిలీజైపోయి, ఫస్ట్ వీకెండ్ కూడా పూర్తిచేసుకుంది. మూవీ ప్రమోషన్ కు సంబంధించి అనుష్కతో ఓ ఇంటర్వ్యూ రికార్డ్ చేసినట్టు వార్తలొచ్చాయి. కానీ ఆ వీడియోను కూడా విడుదల చేయలేదు, కారణం తెలీదు.

మొత్తానికి అనుష్క కనిపించకుండానే, ఈ సినిమా ప్రమోషన్లు ముగుస్తాయని బాధపడిన వాళ్లకు, నిమిషం నిడివి కలిగిన ఈ క్లిప్, పెద్ద ఊరట కలిగించింది. ఈ క్లిప్ లో అనుష్క కాస్త సన్నబడినట్టే కనిపిస్తోంది. మరి ఎందుకు ఆమె బయటకు రాలేదో..?