ఎట్టకేలకు కోలుకున్న ‘ఎన్టీఆర్’ దర్శకుడు

ఎన్టీఆర్ బయోపిక్ ప్రభావం అందరికంటే ఎక్కువగా ఆ సినిమాను తెరకెక్కించిన క్రిష్ పైనే పడింది. అందులో నటించిన హీరోహీరోయిన్లు త్వరగానే బయటపడ్డారు. ఎవరిపని వాళ్లు చేసుకుంటున్నారు. టెక్నీషియన్స్ సంగతి సరేసరి. ఎటొచ్చి క్రిష్ మాత్రం…

ఎన్టీఆర్ బయోపిక్ ప్రభావం అందరికంటే ఎక్కువగా ఆ సినిమాను తెరకెక్కించిన క్రిష్ పైనే పడింది. అందులో నటించిన హీరోహీరోయిన్లు త్వరగానే బయటపడ్డారు. ఎవరిపని వాళ్లు చేసుకుంటున్నారు. టెక్నీషియన్స్ సంగతి సరేసరి. ఎటొచ్చి క్రిష్ మాత్రం అంత త్వరగా ఆ డబుల్ డిజాస్టర్ నుంచి బయటకు రాలేకపోయాడు. ఎట్టకేలకు క్రిష్ కు ఓ ఉపాధి దొరికింది.

ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల తర్వాత ఏ మూవీ చేద్దామనే ఆలోచనలో ఉన్న క్రిష్ కు పిలిచి అవకాశం ఇచ్చాడు దర్శకుడు రాఘవేంద్రరావు. నాగశౌర్య హీరోగా ఓ ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నారు రాఘవేంద్రరావు. ఇందులో 3 ప్రేమకథలుంటాయి. ఒక్కో కథను ఒక్కో దర్శకుడు డైరక్ట్ చేస్తాడు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారు. అలా క్రిష్ చేతికి ఇందులోంచి ఓ కథ వచ్చింది.

నిజానికి ఈ సినిమాకు కథ రాసింది క్రిష్ కాదు, పూర్తిస్థాయిలో దర్శకత్వం వహించబోయేది కూడా క్రిష్ కాదు. ముగ్గురు దర్శకులు హ్యాండిల్ చేసే ఈ సినిమాలో క్రిష్ ది చాలా చిన్న పాత్ర. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రిష్ కు ఈ అవకాశాన్ని ఒప్పుకోక తప్పలేదు. మిగతా ఇద్దరు దర్శకులు ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది.

తనకు కష్టమైనప్పటికీ ఈ సినిమా కోసం కాల్షీట్లు కేటాయిస్తున్నాడు నాగశౌర్య. ప్రస్తుతం ఈ హీరో చేతిలో 3 సినిమాలున్నాయి. అయినప్పటికీ రాఘవేంద్రరావు అడగడంతో కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేస్తున్నాడు. త్వరలోనే సినిమా ప్రారంభం అవుతుంది.

పరిటాల సునీతకు కోరుకున్నది దక్కింది.. ఉంటారా?