Advertisement

Advertisement


Home > Movies - Movie News

69 సినిమాలతో ఆపేసినట్టే ఇక..!

69 సినిమాలతో ఆపేసినట్టే ఇక..!

రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన తమిళ స్టార్ హీరో విజయ్.. అదే టైమ్ లో తన సినిమాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. చేతిలో ఉన్న సినిమాలు చేసి, ఫీల్డ్ నుంచి తప్పుకుంటానని మాత్రమే ప్రకటించాడు. దీంతో విజయ్ చివరి సినిమా ఏంటనే చర్చ కోలీవుడ్ లో కొన్ని నెలలుగా నడుస్తోంది.

ఇప్పుడా చర్చకు తెరపడింది. విజయ్ చివరి సినిమా లాక్ అయింది. ప్రస్తుతం ఈ నటుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇదే అతడి చివరి చిత్రమని చాలామంది భావించారు. అయితే ఇప్పుడు మరో సినిమా ప్రకటించాడు విజయ్.

దర్శకుడు హెచ్.వినోత్ తో  ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్. కెరీర్ లో అతడికిది 69వ చిత్రం. ఈ 69 సినిమాలతో కెరీర్ కు స్వస్తి చెప్పాలని ఈ స్టార్ భావిస్తున్నాడు. వినోద్ సినిమాకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్.. అతడి రాజకీయ కెరీర్ కు ఈ సినిమా ప్లస్ అవుతుందని భావిస్తున్నాడు. అందుకే అంగీకరించాడు. లేదంటే 68 చిత్రాలతోనే ఆపేసేవాడు.

విజయ్ 69వ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. జూన్ నుంచి సినిమా సెట్స్ పైకి వస్తుంది. డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తాడు. హీరోయిన్ ఎవరనేది త్వరలోనే ప్రకటిస్తారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?