Advertisement

Advertisement


Home > Movies - Movie News

అబ్బో.. ఎట్టకేలకు బయటకొచ్చిన దేవరకొండ

అబ్బో.. ఎట్టకేలకు బయటకొచ్చిన దేవరకొండ

ఈమధ్య బాగా ట్రోలింగ్ కు గురయ్యాడు విజయ్ దేవరకొండ. కరోనాపై పోరాటంలో భాగంగా ఇండస్ట్రీ అంతా కదిలి వచ్చినప్పటికీ దేవరకొండ మాత్రం రియాక్ట్ అవ్వలేదంటూ చాలామంది విమర్శలు గుప్పించారు. దాదాపు 2 వారాలుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న విజయ్ దేవరకొండ ఎట్టకేలకు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. వస్తూనే తనదైన స్టయిల్ లో ఓ సందేశం మోసుకొచ్చాడు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మాస్కులకు కొరత తీవ్రంగా ఉంది. అందుకే అంతా మాస్కుల కోసం ఎగబడకుండా ఏదైనా వస్త్రాన్ని ముఖానికి చుట్టుకోవాలని సూచిస్తున్నాడు విజయ్. చేతి రుమాలు, స్కార్ఫ్ లేదా చున్నీని ముఖానికి అడ్డంగా పెట్టుకోవాలని.. మాస్కుల్ని వైద్యుల కోసం వదిలేయాలని విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ పెట్టాడు. ఈ మేరకు తనే ముఖానికి ఓ వస్త్రాన్ని చుట్టుకొని దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశాడు.

పబ్లిక్ సేఫ్టీ ఎనౌన్స్ మెంట్ అంటూ గతనెల 10న ఓసారి కనిపించాడు విజయ్ దేవరకొండ. అంతే.. ఆ తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైపోయాడు. నిజానికి ఈ టైమ్ లో కరోనాపై పోరాటం అంటూ విజయ్ చాలా యాక్టివ్ అవుతాడని, తన రౌడీస్ ను మరోసారి యాక్టివేట్ చేస్తాడని అంతా భావించారు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ విజయ్ సైలెంట్ అయిపోయాడు. ఎట్టకేలకు కొద్దిసేపటి కిందట మళ్లీ సోషల్ మీడియాలోకి వచ్చాడు.

అన్నట్టు ఇదే ఊపులో చిరంజీవి నేతృత్వంలో ఉన్న కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)తో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు విజయ్ ఏమైనా ఆర్థిక సహకారం అందిస్తాడేమో చూడాలి.

ఈ లాక్ డౌన్ పెంచమని మోదీగారిని కోరతాను

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?