హతవిథీ.. ‘హరిహర’ సెట్ లో అగ్నిప్రమాదం

హరిహర వీరమల్లు సినిమాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా కోసం వేసిన సెట్ లో రాత్రి అగ్నిప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని అదుపులోకి తెచ్చారు.…

హరిహర వీరమల్లు సినిమాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా కోసం వేసిన సెట్ లో రాత్రి అగ్నిప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని అదుపులోకి తెచ్చారు. హైదరాబాద్ లోని దుండిగల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ పై యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు సినిమా. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ వేశారు. అయితే ఆమధ్య కురిసిన భారీ వర్షానికి ఆ సెట్ తీవ్రంగా ధ్వంసమైంది. అలా పాడైన సెట్ కు మరమ్మతులు చేస్తున్న టైమ్ లోనే అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది హరిహర వీరమల్లు సినిమా. ఈ సినిమాకు కాల్షీట్లు కేటాయించడంలో పవన్ జాప్యం చేస్తున్నాడు. తాజాగా సినిమాకు కాల్షీట్లు కేటాయించాడు పవన్ కల్యాణ్. అంతలోనే ఇలా సినిమా కోసం వేసిన సెట్ లో అగ్నిప్రమాదం జరిగింది.

ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ కాన్సెప్ట్ తో వస్తోంది. మొఘల్ కాలం నాటి ఓ వజ్రాల దొంగగా పవన్ ఇందులో కనిపించబోతున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.