కేజీఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ మొత్తం మీద తెలుగు సినిమాలు చేతిలోకి తెచ్చేసుకున్నట్లే. ఆయన తెలుగులో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు చేయడానికి రూట్ మ్యాప్ రెడీ చేసేసుకున్నారు. హీరోల వైపు నుంచి మార్గం సుగమం చేసేసుకున్నారు. అయితే ఏ హీరో సినిమా ఏ నిర్మాతతో అన్నది మాత్రం ఇప్పడే కాదు. అది హీరోల కమిట్ మెంట్ లను బట్టి వుంటుంది.
ప్రశాంత్ నీల్ తెలుగులో తొలి సినిమా 2020 డిసెంబర్ నాటికి కానీ ప్రారంభం కాదని తెలుస్తోంది. ముందుగా ఎన్టీఆర్ తో, తరువాత మహేష్ తో, ఆ పైన ప్రభాస్ తో సినిమాలు వుంటాయని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.
మైత్రీ మూవీస్ ఓ నిర్మాతగా రెడీగా వుంది. మిగిలిన నిర్మాతలు ఎవరు అన్నది ఇప్పట్లో తేలేది కాదు. గాలివార్తలు వినిపిస్తూ వుంటాయి అంతే.