ఫస్ట్ నుంచి ప్రమోషన్లకు సమంత!

సమంత నటించిన ప్రెస్టీజియస్ మైధలాజికల్ సినిమా ‘శాకుంతలం’ ఈ సినిమాకు ప్రమోషన్లు చాలా కీలకం. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కనుక సమంత చేసే ప్రమోషన్లే కీలకం.  Advertisement కొన్నాళ్ల క్రితం విడుదలయిన యశోద సినిమాకు…

సమంత నటించిన ప్రెస్టీజియస్ మైధలాజికల్ సినిమా ‘శాకుంతలం’ ఈ సినిమాకు ప్రమోషన్లు చాలా కీలకం. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కనుక సమంత చేసే ప్రమోషన్లే కీలకం. 

కొన్నాళ్ల క్రితం విడుదలయిన యశోద సినిమాకు తన అనారోగ్యం కారణంగా సమంత ప్రమోషన్లు చేయడం కుదరలేదు. ఒక కామన్ ఇంటర్వూ ఇవ్వగలిగారు. శాకుతలం సినిమాకు తాను గట్టిగా ప్రమోషన్లు చేస్తానని సమంత నిర్మాత, దర్శకులకు మాట ఇచ్చి వున్నారు.

ఈ మేరకు ఫిబ్రవరి 1 తరువాత నుంచి సమంత శాకుంతలం ప్రమోషన్లలో జాయిన్ అవుతారని తెలుస్తోంది. సినిమా విడుదల 17న. ఈ లోగా ప్రీ రిలీజ్ ఈవెంట్ వుంటుంది. అలాగే మీడియా మీట్ లు వుంటాయి. వీటన్నింటికీ కూడా సమంత హాజరవుతారని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్నారు కనుక, ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక్కో మీట్ నిర్వహించాల్సి వుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది.

ప్రస్తుతం ముంబాయిలో వున్న సమంత త్వరలోనే హైదరాబాద్ వస్తారు. శాకుంతలం సినిమా కు దాదాపు 80 కోట్లు బడ్జెట్ ఖర్చు చేసారు. అందువల్ల మంచి ఓపెనింగ్ రావాల్సి వుంటుంది. అలా రావాలంటే పబ్లిసిటీ గట్టిగా జరగాల్సి వుంటుంది.