ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అధ్యక్ష పదవి పార్టీలో అధికారానికీ ఆరోవేలు అని వైసీపీ నేతలు ఎపుడూ సెటైర్లు వేస్తూ ఉంటారు. పేరుకు పదవి కానీ చంద్రబాబు లోకేష్ బాబులదే పార్టీలో పెత్తనం అని అంటారు. అచ్చెన్నాయుడుకు ఈ మధ్య అధికారం లోకి వచ్చెస్తామన్న నమ్మకం బాగా ఎక్కువ అయిందో లేక అధినాయకత్వం మెప్పు కోసమో కానీ మాటల తూటలు పేలుస్తున్నారు అంటున్నారు.
ఆయనకు ముఖ్యమంత్రి జగన్ బాబు అండ్ టీం ని తోడేళ్ల గుంపు అని అన్నందుకు ఎక్కడ లేని పౌరుషం వచ్చిందని అంటున్నారు. విపక్షంలో ఉన్న వారికి పౌరుషాలు ఉండాలి. కానీ సబ్జెక్ట్ మీదనే ఆధారం చేసుకుని గట్టిగా మాట్లాడాలి. జగన్ తాను సింహం అని సింగిల్ గా వస్తానని అంటున్నారు. అందులో తప్పేముంది. 2019లో కూడా అదే డైలాగులు జగన్ చెప్పారు.
మరోమారు 2024లో తాను అలాగే ఎన్నికలను ఎదుర్కొంటాను అని అంటున్నారు. కానీ అచ్చెన్న దాని మీద వక్రభాష్యం చెబుతున్నారని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. జగన్ని వెలి వేశారట. ఆయన ఒంటరి అయ్యారట. అందువల్లనే సింగిల్ గా అని అంటున్నారుట. ఇంతకీ జగన్ని ఎవరు వెలి వేశారో అచ్చెన్న చెప్పగలారా అని వైసీపీ నేతలు అడుగుతున్నారు
జగన్ ఏ పార్టీతో అయినా పొత్తుల కోసం పాకులాడారా లేక ఎవరిని అయినా తమతో కలవనై ప్రాధేయపడ్డారా అచ్చెన్నా అని నిలదీస్తున్నారు చంద్రబాబు 2019లో ఒంటరిగా పోటీ చేశారు. మరి ఆయన్ని నాడు విపక్షం అంతా వెలి వేసిందా. అలాగే అనుకోవాలేమో. ఇపుడు బీజేపీ సహా ఇతర పార్టీలతో పొత్తులకు తెలుగుదేశం ప్రయత్నం చేస్తోంది. ఇందులో ఎవరు కాదన్నా బాబుని వెలివేసినట్టా అని అడుగుతున్నారు.
రాజకీయాల్లో ప్రజల మద్దతు ఉన్నంతవరకూ నాయకులు ఒంటరి కాదు, వారిని ఎవరూ వెలి వేయలేరు. 2019లో తెలుగుదేశానికి వచ్చిన 23 సీట్లను చూసుకుంటే ప్రజలు వెలి వేశారని తెలియడం లేదా అని అంటున్నారు. అయినా ఫస్ట్రేషన్ తో జగన్ ఉన్నారని అంటున్న తెలుగుదేశం నేతలు తాము ఎలా ఉన్నారో చూసుకోవాలని కూడా గట్టిగా అంటిస్తున్నారు.
ఇన్ని చెబుతున్న తెలుగుదేశం నేతలు తాము ఒంటరిగా పోటీ చేస్తామని అనలేకపోతున్నారు అక్కడే వారి ఫస్ట్రేషన్ ఏంతో బయటపడుతోంది అని వైసీపీ నేతలు గట్టిగా కౌంటర్లేస్తున్నారు.