ఫోర్బ్స్ జాబితాలో కూడా ప్రభాస్ దే పైచేయి

ప్రతి ఏటా పాపులర్ సెలబ్రిటీస్ లిస్ట్ తయారుచేస్తుంది ఫోర్బ్స్. ప్రముఖుల ఆదాయంతో పాటు సోషల్ మీడియా, వెబ్-ప్రింట్ మీడియాలో వాళ్లకున్న పాపులారిటీని బేస్ చేసుకొని ఈ లిస్ట్ తయారుచేస్తుంది. ఈ ఏడాది కూడా అలాంటి…

ప్రతి ఏటా పాపులర్ సెలబ్రిటీస్ లిస్ట్ తయారుచేస్తుంది ఫోర్బ్స్. ప్రముఖుల ఆదాయంతో పాటు సోషల్ మీడియా, వెబ్-ప్రింట్ మీడియాలో వాళ్లకున్న పాపులారిటీని బేస్ చేసుకొని ఈ లిస్ట్ తయారుచేస్తుంది. ఈ ఏడాది కూడా అలాంటి లిస్ట్ ఒకటి తయారైంది. ఫోర్బ్స్ రూపొందించిన ఈ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి ప్రభాస్ టాప్ లో నిలిచాడు. బాహుబలి సిరీస్ తో పాటు సాహో సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అవ్వడం, సోషల్ మీడియాలో ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరగడంతో ఇది సాధ్యమైంది.

టాప్-100 ఇండియన్ సెలబ్రిటీ లిస్ట్ లో ప్రభాస్ కు 44వ స్థానం దక్కింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలు లిస్ట్ లో స్థానం దక్కించుకోలేకపోయారు. మహేష్ 54వ స్థానంలో కొనసాగుతుండగా.. దర్శకుడు త్రివిక్రమ్ కు 77వ స్థానం దక్కింది.

సౌత్ నుంచి చూసుకుంటే.. అందరికంటే ముందున్నాడు రజనీకాంత్. ఫోర్బ్స్ టాప్-100 సెలబ్రిటీస్ లిస్ట్ లో సూపర్ స్టార్ కు 13వ స్థానం దక్కింది. రజనీకాంత్ తర్వాత ర్యాంక్ పరంగా లిస్ట్ లో ఉన్నది ప్రభాస్ మాత్రమే. ప్రభాస్ తర్వాత 47వ ర్యాంక్ తో విజయ్, 52వ ర్యాంక్ తో అజిత్ కొనసాగుతున్నారు. ఇక దర్శకుడు శంకర్ కు 55వ స్థానం, కమల్ హాసన్ కు 56వ స్థానం దక్కాయి.

లిస్ట్ లో ఈసారి నంబర్ వన్ స్థానాన్ని విరాట్ కోహ్లి దక్కించుకున్నాడు. ఆదాయం పరంగా, క్రేజ్ పరంగా ఎలా చూసుకున్నా అతడే టాప్ లో ఉన్నాడు. ఓ క్రీడాకారుడికి టాప్-1 స్థానం దక్కడం ఫోర్బ్స్ లిస్ట్ లో ఇదే ఫస్ట్ టైమ్. ఇక లిస్ట్ లో రెండో స్థానంలో అక్షయ్ కుమార్, మూడో స్థానంలో సల్మాన్ ఖాన్ నిలిచారు.