Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఫుల్ యాక్షన్ వారియర్

ఫుల్ యాక్షన్ వారియర్

రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా వారియర్. ఈ సినిమా ట్రయిలర్ వచ్చేసింది. లింగుస్వామి అంటేనే మాస్ యాక్షన్. పందెంకోడి, ఆవారా సినిమాలు మన కళ్ల ముందుకు వస్తాయి. 

వారియర్ ట్రయిలర్ కూడా ఫుల్ యాక్షన్ తో కట్ చేసారు. స్టోరీ లైన్ పెద్దగా చెప్పలేదు. కానీ ట్రయిలర్ లో చూపించిన మేరకు అయితే కర్నూలులో కరుడుకట్టిన విలన్, అతగాడిని ఢీకొనే బలమైన పోలస్ ఆఫీసర్ మధ్య సాగిన కథగా కనిపిస్తోంది.

కథ సంగతి పక్కన పెడితే యాక్షన్ సీన్లు చాలా బలంగా చిత్రీకరించారు. పవర్ ఫుల్ డైలాగులు వేసారు. అక్కడితో ఆగకుండా కృతిశెట్టి అందాలు కూడా ట్రయిలర్ కు జోడించారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రామ్ గెటప్, నటన బాగానే వున్నాయి. ఆది పినిశెట్టి అయితే రామ్ ను డామినేట్ చేసేలా కనిపించాడు ట్రయిలర్ లో.

విజువల్స్ రిచ్ గా వున్నాయి. యాక్షన్ సీన్లతో పాటు విలనిజం ఎలివేట్ చేయానికి వేసిన మరికొన్ని సీన్లు కూడా ట్రయిలర్ కు ప్లస్ అయ్యాయి. దేవీ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ఓకె. వారియర్ సినిమాకు సమర్పణ పవన్ కుమార్. నిర్మాత చిట్టూరి శ్రీను.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?