Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఫుల్ సౌండ్ తో నిశ్శబ్దం

ఫుల్ సౌండ్ తో నిశ్శబ్దం

నిశ్ళబ్దం సినిమా లేట్ అయింది కానీ దాని మీద వున్న అంతో ఇంతో వున్న అంచనాలు అయితే తగ్గలేదు. సినిమా విడుదల ఇంకో రెండు వారాలు వుండగానే నిశ్శబ్దం ట్రయిలర్ అమెజాన్ ప్రయిమ్ లో విడుదలయింది. ఇప్పుడు సినిమా మీద ఫుల్ క్లారిటీ వచ్చింది. అసలు సినిమా నిర్మాతలు ఇన్నాళ్లు ఈ సినిమా కు బజ్ తీసుకురావడంలో కాస్త ఫెయిలయ్యారేమో? అనిపించింది. 

అనుష్క, మాధవన్, షాలినీ పాండే, అంజలి, అవసరాల, ఇంకా హాలీవుడ్ స్టార్ కాస్ట్ వుండి కూడా ఇప్పటి దాకా సినిమా విషయాలు అన్నీ అలా అజ్ఞాతంలో వుంచుకున్నారు. ట్రయిలర్ చాలా గ్రాండియర్ గా వుంది. సస్పెన్స్  థ్రిల్లర్ సబ్జెక్ట్ కావడం, పూర్తిగా అమెరికా నేపథ్యంలో పిక్చరైజ్ కావడం, కొంత మంది విదేశీ నటులు వుండడంతో, ట్రయిలర్ కు పూర్తిగా హాలీవుడ్ టచ్ వచ్చినట్లు అయింది.

అయితే పాటలు, పంచ్ డైలాగులు, ఫన్ సీన్లు కోరుకునే ఆడియన్స్ సంగతి పక్కన పెడితే కాస్త డిఫెరెంట్ క్వాలిటీ మూవీ ని ఆశించేవారికి నచ్చేలా కట్ చేసారు ట్రయిలర్ ను. పీపుల్స్ మీడియా పతాకంపై విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన సినిమా ట్రయిలర్ చూస్తుంటే గాట్టిగానే ఖర్చు చేసినట్లు అర్థమైపోతోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?