గీతాఆర్ట్స్ కెరీర్ లో భారీ డిజాస్టర్ ఇదే!

వారం గడిచిపోయింది.. అసలు రంగు తేలిపోయింది.. చావు కబురు చల్లగా తేలిపోయింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా.  Advertisement ఈ…

వారం గడిచిపోయింది.. అసలు రంగు తేలిపోయింది.. చావు కబురు చల్లగా తేలిపోయింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా. 

ఈ సినిమా కోసం హీరో కార్తికేయ చాలా కష్టపడ్డాడు. బాలరాజు పాత్ర కోసం ఎంతో హోం వర్క్ చేయడంతో పాటు మూవీ రిలీజ్ కోసం ప్రమోషన్స్ తో చాలా ప్రయాస పడ్డాడు. కానీ అతడి కష్టం వృధా అయింది. భారీ పబ్లిసిటీ కారణంగా మొదటిరోజు ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చినప్పటికీ.. రెండో రోజు నుంచి ఈ సినిమా ఫ్లాట్ అయింది. సినిమాలో చర్చించిన పాయింట్ తెలుగు ఆడియన్స్ కు నచ్చలేదు.

ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే.. ఏపీ,నైజాం కలిపి ఈ సినిమా 13 కోట్ల రూపాయల ప్రీ-రిలీజి బిజినెస్ చేసింది. జీఏ2 బ్యానర్ పై ఉన్న నమ్మకంతో కాస్త ఎక్కువ రేట్లు పెట్టి మరీ ఈ సినిమా కొన్నారు. కానీ ఫైనల్ రన్ ముగిసేనాటికి ఈ సినిమా 5 కోట్ల (గ్రాస్) దగ్గరే ఆగిపోయింది.

కార్తికేయకు ఇలాంటి దెబ్బలు కొత్తకాదు. ఇంతకుముందే అతడు హిప్పీ రూపంలో డబుల్ డిజాస్టర్ చవిచూశాడు. ఎటొచ్చి గీతాఆర్ట్స్-2 పిక్చర్స్ కు మాత్రం ఇదే అతిపెద్ద డిజాస్టర్. తక్కువ బడ్జెట్ తో ఓ చిన్న ప్రయోగం చేసిన బన్నీ వాసు, ఆర్థికంగా నష్టపోలేదు కానీ, ట్రేడ్ లో మాత్రం తన క్రెడిబిలిటీని కాస్త పోగొట్టుకున్నాడు.