డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణ, స్క్రీన్ ప్లే దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం 'గాలి సంపత్`. . ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్, షైన్ స్క్రీన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హీరో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నఈ మూవీకి అనీష్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా వచ్చే నెల 11న విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ మీడియా మీట్ నిర్వహించారు. ఈ మీట్ లో ఏస్ డిస్ట్రబ్యూటర్, నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గాలి సంపత్ లో వినోదంతో పాటు మంచి సందేశం కూడా వుంటుంది. చాలా కొత్తగా ఉంది. పటాస్ నుంచి సరిలేరు నీకెవ్వరు వరకూ అనిల్ జర్నీ అందరికీ తెలుసు. ఏ దర్శకుడైనా ఒక చిన్న సినిమాతో మొదలై సక్సెస్ సాధిస్తూ పెద్ద చిత్రాలకు దర్శకత్వం వహిస్తుంటారు.
దాసరి, కోడి రామకృష్ణ తదితరులు పెద్ద, చిన్న సినిమాలు రెండూ చేసారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది. ఈ సమయంలో చిన్న సినిమాల వైపు పెద్ద దర్శకులు ఎవరు చూడడం లేదు. అది మారాలనే అనిల్ ఈ సినిమాను బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. మార్చి 11న విడుదల అవుతున్న గాలి సంపత్ తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది.
ఒక పెద్ద దర్శకుడు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తీయాలి. ఎందుకంటే చిన్న సినిమాలకు ప్రేక్షకులు రావాలంటే ఆ సినిమాకు ఏదో ఒక ఎక్స్ ట్రా ఫోర్స్ ఉండాలి. ప్రతి పెద్ద డైరెక్టర్ కి ఒక మార్క్ ఉంటుంది అది యాడ్ అయినప్పుడు చిన్న సినిమాకూడా పెద్ద సినిమా అవుతుంది. అదేవిధంగా గాలి సంపత్ కూడా రేపు మార్చి 11న ఒక పెద్ద సినిమా అవుతుంది అని నమ్ముతున్నాను.
దర్శకుడు అనీష్ దగ్గర కూడా ఒక మంచి కామెడీ టింజ్ ఉంది. ఆయన దర్శకత్వం వహించిన అలా ఎలా? సినిమా చూస్తున్నప్పుడు నేను కడుపుబ్బ నవ్వాను. రీసెంట్గా ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ చూశాను చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. అలాగే క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు శ్రీ విష్ణు ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ని చాలా ఎక్స్ట్రార్డినరీగా పండించారు అన్నారు.
చిత్ర దర్శకుడు అనీష్ మాట్లాడుతూ – “గాలి సంపత్ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ తో పాటు సినిమాలో మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయి. రాజేంద్రప్రసాద్ గారు గాలి సంపత్ పాత్రకు ప్రాణం పోశారు. రేపు మార్చి 11న ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ ఫీలవుతారు అన్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “షైన్ స్క్రీన్స్ నిర్మాతలు ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ కలిసి గాలి సంపత్ నిర్మించారు. ఆ కథలో ఉన్న మ్యాజిక్ మిస్ కాకూడదనే మేం అందరం కలిసి ఒక టీమ్‌గా ముందుకెళ్లడం జరిగింది. సినిమా విషయానికి వస్తే గాలి సంపత్ అనగానే రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి గొంతు కి ప్రమాదం జరిగి అతని గొంతులో నుంచి మాట బయటికి రాదు కేవలం గాలి మాత్రమే వస్తుంది. అదే ఈ సినిమా కాన్సెప్ట్.
మీరు బాహుబలి సినిమా తీసుకుంటే అందులో కిలికి భాష అని ఉంటుంది. అది మనకు అర్థం కాదు అలాగే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక చిలిపి భాష మాట్లాడటం జరిగింది. అదే ఫి..ఫి.. ఫీ లాంగ్వేజ్. అది మీ అందర్నీ ఎంతో ఎంటర్టైన్ చేయబోతుంది. బోలెడంత ఎంటర్టైన్మెంట్ తో పాటు తండ్రీ కొడుకుల మధ్య ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ కూడా ఈ సినిమాలో ఉంది. ముఖ్యంగా ఒక 30 అడుగుల లోతు నుయ్యిలో మాటలు రాని గాలి సంపత్ పడినప్పుడు తను ఎలా బయటపడ్డాడు అనేది సెంకడాఫ్.
ఇలాంటి చాలా థ్రిల్లింగ్ పాయింట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ మ్యాజికల్ సన్నివేశాలు అద్భుతంగా రావాలనే ఈ సినిమాకు నా కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్‌గా ఈ సినిమాను మీరు అనుకున్న దాని కన్నా ఇంకా బెటర్ గా ఎంజాయ్ చేస్తారు అన్నారు.