సినిమాకు టైటిళ్ల దగ్గరే వైవిధ్యం చూపించాల్సిన అవసరం వుంది. అప్పుడే సినిమా మీద ఒక రకమైన క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది. అందుకే మేకర్లు ఈ విషయంలో చాలా ఆలోచించి మరీ టైటిళ్లు పెడుతుున్నారు. లేటెస్ట్ గా అలాంటి టైటిల్ ఒకటి చక్కర్లు కొడుతొంది. వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు అందిస్తున్న సినిమాకు ‘గాండీవ ధారి అర్జున’ అనే టైటిల్ పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది.
భోగవిల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. టైటిల్ అనౌన్స్ మెంట్ బకాయి వుంది. దాంతోనే ప్రమోషన్లు షురూ చేయాల్సి వుంది. వరుణ్ తేజ్ కు కాస్త గ్యాప్ వచ్చింది. ఎఫ్ 3 తరువాత ఇదే సినిమా. పక్కా మాస్ సినిమా చేయాలని అనుకుంటూ వెయిటింగ్ లో వున్న వరుణ్ ఓ మాంచి యాక్షన్ సినిమాగా ప్రవీణ్ సత్తారు సినిమా ఓకె చేసారు. చాలా వరకు విదేశాల్లో షూట్ చేసారు ఈ సినిమాను. పూర్తిగా స్టయిలిష్ యాక్షన్, గన్స్ వంటి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ వుంటుంది.
మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాను వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు సమర్పించడం విశేషం.