Advertisement

Advertisement


Home > Movies - Movie News

'గ్యాంగ్'కు డీసెంట్ ఓపెనింగ్

'గ్యాంగ్'కు డీసెంట్ ఓపెనింగ్

ఇటు నాని అభిమానులు, అటు విక్రమ్ కె కుమార్ అభిమానులు ఎదురుచూసిన సినిమా నానీస్ గ్యాంగ్ లీడర్. ఈవారం విడుదలయిన ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఓపెనింగ్ మాత్రం డీసెంట్ గా వుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 21 కోట్ల మేరకు మార్కెట్ చేసారు.

తొలిరోజే దాదాపు నాలుగున్నర కోట్లకు పైగా వసూలు చేసింది. అంటే ఫస్ట్ డే నే వన్ ఫోర్త్ వచ్చేసినట్లు అన్నమాట. ఇంకా శని, ఆదివారాలు వున్నాయి. ఈ రెండురోజులు కలిపి మరో ఇంత వసూలు చేసినా, ఫస్ట్ వీకెండ్ సగానికి సగం వచ్చేసినట్లు అవుతుంది.

నాని చెప్పినట్లే సినిమా ఉందా..? ఫ్యామిలీ గ్యాంగ్‌ సంగతేంటి?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?