Advertisement

Advertisement


Home > Movies - Movie News

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. మరో విడుదల తేదీ

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. మరో విడుదల తేదీ

ఈమధ్య కాలంలో ఇన్ని విడుదల తేదీలు మార్చిన సినిమా బహుశా ఇదేనేమో. విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గతేడాది నుంచి మినిమం గ్యాప్స్ లో వాయిదా పడుతూనే ఉంది.

ఇంకా చెప్పాలంటే 2023 అక్టోబర్ నుంచి ఈ సినిమా వాయిదాలు పడుతూనే ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే, స్వయంగా మేకర్స్ ఓ డేట్ ప్రకటించడం, ఆ తర్వాత ఆ తేదీ నుంచి సినిమాను పక్కకు జరపడం కామన్ అయిపోయింది.

ఒక దశలో ఏకంగా హీరో విశ్వక్ సేన్, నిర్మాతపై ఫైర్ అయ్యాడు. చెప్పిన తేదీకి సినిమాను విడుదల చేయకపోతే ప్రచారం చేయనంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. గమ్మత్తైన విషయం ఏంటంటే, విశ్వక్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత సినిమా 2 సార్లు వాయిదా పడింది.

అలా వాయిదాల పర్వంలో పీహెచ్డీ చేసిన ఈ సినిమాకు ఇప్పుడు మరో విడుదల తేదీని ప్రకటించారు. అదే మే 17. ఈసారి చెప్పిన తేదీకి గ్యారెంటీగా థియేటర్లలోకి వస్తామంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత, ఆ తేదీలన్నీ చూసుకొని మరీ ఈ సినిమాకు డేట్ వేశారు.

కృష్ణచైతన్య డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ పాట హిట్టవ్వడం యూనిట్ కు కలిసొచ్చింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?