గంగూబాయ్..అదిరింది భాయ్

గంగూబాయ్ కథియావాడీ…బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజ‌య్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించి నిర్మించిన సినిమా. ఆలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా.  Advertisement వేశ్యావాటికలో చిక్కుకుని, అక్కడి నుంచి నాయకురాలిగా ఎదిగిన ఓ పోరాటయోధురాలి…

గంగూబాయ్ కథియావాడీ…బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజ‌య్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించి నిర్మించిన సినిమా. ఆలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా. 

వేశ్యావాటికలో చిక్కుకుని, అక్కడి నుంచి నాయకురాలిగా ఎదిగిన ఓ పోరాటయోధురాలి బయోపిక్. ఈ సినిమా ట్రయిలర్ ను కొద్ది మంది తెలుగు మీడియా వారికి ముంబాయి లో ఎక్స్ క్లూజివ్ గా ప్రదర్శించారు. ఇటు తెలుగు వెర్షన్ ను అటు హిందీ వెర్షన్ ను కూడా ప్రదర్శించారు.

సినిమా చాలా భారీగా, ఎప్పటిలాగే సంజ‌య్ లీలా భన్సాలీ మార్క్ తో వుంది. ఈ సినిమా ప్రత్యేకం ఏమిటంటే ఆలియాభట్ నటన, సినిమాలో డైలాగులు మగజాతి దురహంకారంపై, దౌర్జ‌న్యాలపై పవర్ ఫుల్ డైలాగులు ట్రయిలర్ లో చోటు చేసుకున్నాయి. యుక్త వయస్సు నుంచి ప్రౌఢ గా, నాయకురాలిగా ఎదిగే క్రమంలో ఆలియాభట్ మంచి పరిణితి చెందిన నటనను ప్రదర్శించింది.

బలమైన బాడీ లాంగ్వేజ్, పవర్ ఫుల్ డైలాగులు చెబుతూనే, కళ్లలో బాధను ప్రదర్శిస్తూ మంచి నటి అని మరోసారి ప్రూవ్ చేసుకుంది. మహానటి తరువాత హీరోయిన్ సెంట్రిక్ బయోపిక్ ఇదే. 

ఓ మంచి బయోపిక్ కు కావాల్సిన లక్షణాలు అన్నీ వున్నాయి అనిపించింది, అయితే ట్రయిలర్ లో వేసిన కట్స్ లో చాలా వరకు అతి తక్కువ సీన్ల నుంచి తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది. సినిమా అంతా రివీల్ చెేయకుండా వుండాలని దాచారో, లేక సినిమానే అంతేనేమో అన్నది విడుదల అయితే కానీ తెలియదు.