హారర్-కామెడీ.. అరిగిపోయిన సీడీ లాంటి కాన్సెప్ట్ ఇది. గట్టిగా లెక్కలు తీస్తే ఓ వంద సినిమాలైనా వచ్చి ఉంటాయేమో. ఇలాంటి కాన్సెప్ట్ తో గీతాంజలి 'మళ్లీ వచ్చింది'.
ఒకప్పుడు ఇదే ఫార్ములాతో హిట్ అందుకున్న సినిమా గీతాంజలి. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ అంటూ, సేమ్ జానర్ లో 'గీతాంజలి మళ్లీ వచ్చింది' టైటిల్ తో సినిమా తీశారు.
ఓ పాడుబడ్డ భవంతి. దాని పేరు సంగీత్ మహల్. అందులో షూటింగ్ కోసం ఓ బ్యాచ్ ఎంటర్ అవుతుంది. ఆల్రెడీ అందులో కొన్ని దెయ్యాలుంటాయి. నటించడానికి వెళ్లిన ఆర్టిస్టులు, ఆ దెయ్యాలతో చేసిన అల్లరే ఈ 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమా.
ఇదేదో మేం ఊహించి చెప్పడం లేదు, కొద్దిసేపటి కిందట రిలీజైన ట్రయిలర్ చూస్తే మీరు కూడా ఇదే మాట చెబుతారు. ట్రయిలర్ చూస్తే రొటీన్ స్టఫ్ అని తెలుస్తోంది. కథ-కాన్సెప్ట్ రొటీన్ గా ఉన్నప్పటికీ కామెడీ క్లిక్ అయితే ఈ జానర్ లో సినిమాలకు తిరుగుండదు.
అందుకు తగ్గట్టే సునీల్, అలీ, సత్య, షకలక శంకర్, శ్రీనివాసరెడ్డి లాంటి కమెడియన్స్ అందర్నీ ఇందులో పెట్టారు. ట్రయిలర్ చివర్లో సత్య చెప్పిన కామెడీ డైలాగ్ మాత్రమే బాగుంది. మూవీ ఏ రేంజ్ లో కామెడీ పండించిందో తెలియాలంటే మార్చి 22 వరకు ఆగాల్సిందే.
శివ తుర్లపాటి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు కోన వెంకట్ అన్నీ తానై వ్యవహరించాడు. కెరీర్ లో అంజలికి ఇది 50వ సినిమా.