ఓ సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమా ఎనౌన్స్ చేయడం నానికి అలవాటు. సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే, కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్తాడు. ఈసారి కూడా అదే పని చేశాడు. ప్రస్తుతం 'సరిపోదా శనివారం' అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్న ఈ నటుడు, తన నెక్ట్స్ మూవీని ఎనౌన్స్ చేశాడు.
సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాని. ఇది కూడా యాక్షన్ సినిమానే. హింసాత్మకంగా ఉండే ఓ వ్యక్తి అహింసావాదిగా మారితే, అతడి జీవితం పూర్తిగా తలకిందులైతే ఏమౌతుందనేది ఈ సినిమా కాన్సెప్ట్.
డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాతగా రాబోతుంది ఈ సినిమా. ఈరోజు రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ లో 2025 రిలీజ్ అని కూడా చెప్పారు.
చాన్నాళ్లుగా నాని దగ్గర దానయ్య అడ్వాన్స్ ఉంది. అటు సుజీత్, ఆల్రెడీ దానయ్య కాంపౌండ్ లోనే ఉన్నాడు. పవన్ కల్యాణ్ హీరోగా ఓజీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే నానితో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు.
పవన్ సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి అనుకున్న సమయానికి ఓజీ కంప్లీట్ అయినా, అవ్వకపోయినా నాని సినిమాను స్టార్ట్ చేస్తాడు సుజీత్. ఈ విషయంలో అతడు హరీశ్ శంకర్ పద్ధతినే ఫాలో అవ్వబోతున్నాడు. పైగా నిర్మాత కూడా ఒక్కరే కాబట్టి సుజీత్ కు సమస్య ఉండకపోవచ్చు.