దీపిక, సిద్ధార్థ్ చతుర్వేది ల హాట్ హాట్ పోజులతో వార్తల్లో నిలుస్తున్న గెహరాయియాన్ సినిమా కు ఏ సర్టిఫికెట్ దక్కింది. ఈ సినిమాకు ఎలాంటి కట్స్ చెప్పని సెన్సార్ బోర్డు అడాల్ట్స్ ఓన్లీ సర్టిఫికెట్ ను జారీ చేసింది. రేపు విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ తో మరింత హాట్ అనిపించుకుంటూ ఉంది.
ఈ సినిమాకు సంబంధించిన పోజుల్లో హీరో,హీరోయిన్ల ఎరోటిక్ స్టైల్ ను చూసి చాలా మంది బుగ్గలు నొక్కుకున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో ఇలాంటి హాట్ పోజుల సినిమాలు బోలెడు వచ్చినా, ఈ సినిమా మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. వివాహిత అయిన దీపిక ఇలా రెచ్చిపోవడం గురించి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు.
అందులో బాగా హైలెట్ అయినది దీపిక ఈ సీన్లలో నటించడానికి రణ్ వీర్ పర్మిషన్ తీసుకుందా? అనేది! వెటకారంగా ఈ కామెంట్ ను చాలా మంది చేశారు. ఈ అంశంపై దీపిక సూటిగా స్పందించకనే స్పందించింది. ఈ విషయంలో మరీ పర్మిషన్ తీసుకునేంత ఏముందున్నట్టుగా ఉంది దీపిక స్పందన.
తను, రణ్ వీర్ వేర్వురు తరహా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లమని.. అయినప్పటికీ నటన విషయంలో తమ మధ్య ఎలాంటి అరమరికలు లేవన్నట్టుగా దీపిక స్పష్టం చేసింది. రణ్ వీర్ సినిమాల్లో తనకు ఇష్టమైన వాటిల్లో గల్లీ బాయ్, బ్యాండ్ బజా బారాత్ లు ముందు వరసలో ఉంటాయని దీపిక చెప్పుకొచ్చింది.