సంయుక్త మీనన్…బ్యాక్ టు బ్యాక్ నాలుగు హిట్ లు ఖాతాలో వేసుకుంది. భీమ్లా నాయక్, సర్, బింబిసార, విరూపాక్ష..మూడు సినిమాలు. రెండు సినిమాలు ఒక బ్యానర్ లో. మరో సినిమా ఇంకో బ్యానర్ లో. చేతిలో మరో సినిమా వుంది కళ్యాణ్ రామ్ తో అభిషేక్ నామా నిర్మించే పీరియాడిక్ మూవీ.
ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ లు కొట్టి, హోమ్లీగా వుండి, కాస్తో..కూస్తో గ్లామర్ వున్న హీరోయిన్ కు అవకాశాలు వెదుక్కుంటూ రావాలి. అస్సలు సెకెండ్ ఖాళీ వుండకూడదు.
కానీ సంయుక్త పరిస్థితి అలా అయితే లేదు. నిజానికి నిర్మాతలు వెంటపడాలి..రెమ్యూనిరేషన్ పెంచాలి. కానీ ఇలా జరుగుతున్నట్లు లేదు. ఎందుకూ? అని ఆరా తీస్తే, నిర్మాతలు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు సంయుక్త మీద..మరి ఎందుకో? ఇప్పటికే సంయుక్త తో సినిమా తీసిన వాళ్లు..అబ్బే..ఇప్పటికే చేసాం..మళ్లీనా..అని పెదవి విరిచేస్తున్నారు.
పైగా ఈ మధ్య సంయుక్త టైమ్ అస్సలు పాటించడం లేదు అని మరో కంప్లయింట్. ఫంక్షన్ అయినా మరేదయినా కనీసం గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా వస్తోందన్నది కొందరి మాట. కొందరయితే మరీ కష్టాలు ఏకరవు పెడుతుంది వినలేం అంటూ కామెంట్.
మరి ఇవన్నీ నిజాలో కాదో అన్నది పక్కన పెడితే సక్సెస్ లు వచ్చిన వేడి, ఆఫర్ల దగ్గర మాత్రం కనిపించడం లేదు అన్నది వాస్తవం.