Advertisement

Advertisement


Home > Movies - Movie News

సందడిగా ఉన్న పెళ్లిలో విశ్వం విధ్వంసం

సందడిగా ఉన్న పెళ్లిలో విశ్వం విధ్వంసం

శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. పనిలో పనిగా టైటిల్ కూడా ఎనౌన్స్ చేశారు. గోపీచంద్-వైట్ల సినిమాకు విశ్వం అనే పేరు పెట్టారు. గ్లింప్స్ లో యాక్షన్ ఎలిమెంట్స్ చూపించారు .

చూడ్డానికి కశ్మీర్ లా ఉన్న ఓ ప్రాంతంలో ఓ వర్గం పెళ్లి ఏర్పాట్లలో మునిగి ఉంది. పెళ్లికూతురు రెడీ అయింది. పెళ్లి కొడుకు కూడా రెడీ అయ్యాడు. ఇద్దరూ మండంపంపైకి వచ్చారు. ఆహుతులంతా ఉత్సాహంగా అటుఇటు తిరుగుతున్నారు. వేడివేడిగా భోజనాలు కూడా రెడీ అయ్యాయి.

అంతలోనే గోపీచంద్ ఎంట్రీ ఇస్తాడు. నల్ల దుస్తుల్లో మెషీన్ గన్ పట్టుకొని పెళ్లిలో అడుగుపెట్టిన గోపీచంద్, అక్కడున్న వాళ్లందర్నీ, ఆడ-మగ తేడా లేకుండా, విచక్షణారహితంగా కాల్చిపారేస్తాడు. ఆ తర్వాత కూల్ గా భోజనాల దగ్గరకు వెళ్తాడు. ప్లేట్ లో బిర్యానీ వడ్డించుకొని డైలాగ్ చెబుతాడు. 'ప్రతి అన్నం మెతుకు మీద అది ఎవరు తినాలో రాసి పెట్టి ఉంటుంది, దీనిపై నా పేరు రాసిపెట్టి ఉంది' అంటూ డైలాగ్ చెబుతాడు. ఆ వెంటనే విశ్వం అనే టైటిల్ కార్డ్ పడుతుంది.

ఇదీ గోపీచంద్-శ్రీనువైట్ల కలిసి తీస్తున్న సినిమా మేటర్. సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయనే విషయం ఈ గ్లింప్స్ చూస్తుంటే అర్థమౌతోంది. కానీ పచ్చటి పందిరిలో అందర్నీ అమానుషంగా కాల్చిపడేయడం (మహిళలతో సహా) ఎంతవరకు హీరోయిజం అనిపించుకుంటుంది? బహుశా సినిమా రిలీజైన తర్వాత ఈ అంశంపై క్లారిటీ వస్తుందేమో. ఇక చివర్లో హీరో పంచ్ డైలాగ్ చెబుతాడనుకుంటే, పాత సామెత చెప్పించి క్లోజ్ చేశారు. పంచ్ డైలాగ్స్ కు పెట్టింది పేరు వైట్ల, కానీ ఈసారి ఎందుకో తన మార్క్ చూపించలేదు.

ఇది కేవలం గ్లింప్స్ కాబట్టి అప్పుడే ఈ ప్రాజెక్టుపై ఒక అభిప్రాయానికి రాలేం. ఎందుకంటే, ఇటు వైట్ల, అటు గోపీచంద్ ఇద్దరూ మంచి కసి మీదున్నారు. ఎలాగైనా హిట్ ఇవ్వాలని శ్రీనువైట్ల, కొట్టాలని గోపీచంద్ రగిలిపోతున్నారు. కాబట్టి మంచి ప్రొడెక్ట్ బయటకొచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పుడొచ్చిన గ్లింప్స్ ఆధారంగా ఏదీ నిర్ణయించలేం. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి.

చిత్రాలయం స్టుడియోస్, పీపుల్ మీడియా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కావ్యథాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. చైతన్ భరధ్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాకు సంబంధించి టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?