లక్కీ భాస్కర్ ఓ బ్యాంక్ క్యాషియర్

లక్కీ భాస్కర్ ఫస్ట్ లుక్ రిలీజైనప్పుడే ఆ సినిమా కథపై ఓ చిన్నపాటి చర్చ జరిగింది. అదే ఇప్పుడు నిజమైంది. లక్కీ భాస్కర్ సినిమా మొత్తం డబ్బు, బ్యాంక్ స్కామ్ చుట్టూ తిరుగుతుంది. ఈరోజు…

లక్కీ భాస్కర్ ఫస్ట్ లుక్ రిలీజైనప్పుడే ఆ సినిమా కథపై ఓ చిన్నపాటి చర్చ జరిగింది. అదే ఇప్పుడు నిజమైంది. లక్కీ భాస్కర్ సినిమా మొత్తం డబ్బు, బ్యాంక్ స్కామ్ చుట్టూ తిరుగుతుంది. ఈరోజు రిలీజైన టీజర్ తో సినిమాపై పూర్తి స్పష్టత ఇచ్చారు.

లక్కీ భాస్కర్ సినిమాలో బ్యాంక్ క్యాషియర్ గా నటిస్తున్నాడు దుల్కర్ సల్మాన్. ఒక సాధారణ వ్యక్తి అసాధారణ స్థాయికి ఎలా చేరుకున్నాడు, అతడి ఎకౌంట్ లోకి అంత డబ్బు ఎలా వచ్చింది, తిరిగి డబ్బంతా ఎలా మాయమైంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓ సాధారణ, మధ్యతరగతి వ్యక్తి డబ్బులు ఎలా కూడబెడతాడు, పంతానికి పోతే ఆ డబ్బంతా నిమిషాల్లో ఎలా ఖర్చుపెడతాడో ఇందులో చూపించబోతున్నారు. దుల్కర్ సల్మాన్ చెప్పిన డైలాగ్ దీనికి నిదర్శనం.

దుల్కర్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. సార్ సినిమా తర్వాత వెంకీ అట్లూరి నుంచి వస్తున్న మూవీ ఇదే. సార్ తో అతడు తన రూటును పూర్తిగా మార్చేశాడనే విషయం లక్కీ భాస్కర్ టీజర్ చూస్తుంటే అర్థమౌతోంది.

పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. టీజర్ కు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనేది నిర్మాత నాగవంశీ ప్లాన్.