హీరో గోపీచంద్ డైరక్టర్ శీవాస్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఒకటి వుంది. ఈ సినిమా టైటిల్ ను బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లో రివీల్ చేసారు. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించే ఈ సినిమాకు రామబాణం అని టైటిల్ పెట్టారు.
ఇప్పటి వరకు అన్ స్టాపబుల్ షో లో ఇలా టైటిల్స్ రిలీజ్ చేయడం, సినిమా ప్రమోషన్ కంటెంట్ రివీల్ చేయడం వంటివి జరగలేదు. ఇదే ఫస్ట్ టైమ్.
ప్రభాస్ తో కలిసి బాలయ్య చాట్ షో చేసారు. ఈ షో కి గోపీచంద్ కూడా హాజరయ్యారు. మధ్యలో డిస్కషన్ లో పార్ట్ గా ఈ టైటిల్ ను రివీల్ చేసారు. గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌లది టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్లను అందించారు. ఇప్పుడు మూడో సారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమైన బలమైన కథాంశం ఉన్న చిత్రమిది.
భూపతి రాజా చాలా రోజుల తరువాత కథ అందిస్తున్నారు.వెలిగొండ శ్రీనివాస్ మాటలు, మిక్కీ జే మేయర్ సంగెీతం అందిస్తున్న నిర్మాత విశ్వప్రసాద్.