భీమాలో పోలీస్ పాత్రలో కొత్తదనం ఏంటి?

గోపీచంద్ కు పోలీస్ పాత్రలు కొత్త కాదు. ఇంతకుముందే పలుమార్లు అతడు పోలీస్ గెటప్ లో కనిపించాడు. ఇప్పుడు మరోసారి భీమాలో పోలీస్ గా కనిపించబోతున్నాడు. మరి గత పాత్రలతో పోలిస్తే, ఈ పోలీస్…

గోపీచంద్ కు పోలీస్ పాత్రలు కొత్త కాదు. ఇంతకుముందే పలుమార్లు అతడు పోలీస్ గెటప్ లో కనిపించాడు. ఇప్పుడు మరోసారి భీమాలో పోలీస్ గా కనిపించబోతున్నాడు. మరి గత పాత్రలతో పోలిస్తే, ఈ పోలీస్ గెటప్ లో కొత్తదనం ఏంటి..?

“గోలీమార్ లో డిఫరెంట్ పోలీస్ గెటప్. ఆంధ్రుడు లవ్ స్టొరీ మీద నడుస్తుంది కానీ దాని నేపధ్యం పోలీసు కథే. శౌర్యం కూడా భిన్నమైన కథ. ఈ 3 చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పాత్ర భీమా. బ్రహ్మరాక్షసుడి లాంటి పోలీస్ కథ ఇది. పైగా దీనికి సెమీ ఫాంటసీ ఎలిమెంట్ కూడా కొత్తగా యాడ్ అయింది. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది.”

ఇలా తను పోషించిన పోలీస్ పాత్రలకు, భీమా క్యారెక్టర్ కు మధ్య తేడా చెప్పుకొచ్చాడు గోపీచంద్. ఈ సందర్భంగా మరో అంశంపై కూడా క్లారిటీ ఇచ్చాడు గోపీచంద్.

“ట్రయిలర్ చూసి చాలామంది అఖండ సినిమాలా ఉందని అనుకుంటున్నారు. అలాంటిదేం లేదు. అఘోరాలు, కలర్ పాలెట్, మ్యూజిక్ వలన అలా అనిపించి ఉండొచ్చేమో కానీ భీమా పూర్తిగా డిఫరెంట్ స్టొరీ. అయితే నిజంగా అఖండ సినిమాతో పోలిస్తే మంచిదేగా. భీమా పరశురామక్షేత్రంలో జరిగే కథ. అందుకే అలాంటి నేపధ్యం తీసుకున్నాం.”

ఇదే అంశంపై 2 రోజుల కిందట నిర్మాత కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు గోపీచంద్ కూడా భీమాకు, అఖండకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వస్తోంది భీమా.