Advertisement

Advertisement


Home > Politics - National

నంబర్ వన్ స్థానం కోల్పోయిన ప్రపంచ కుబేరుడు

నంబర్ వన్ స్థానం కోల్పోయిన ప్రపంచ కుబేరుడు

ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఎవరైనా ఠక్కున చెప్పే పేరు ఎలాన్ మస్క్. కొన్నాళ్లుగా టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు మస్క్. అయితే తాజా అంచనాల ప్రకారం, ఇతడు తన ర్యాంకింగ్ కోల్పోయాడు.

ప్రస్తుతం ప్రపంచ కుబేరుడు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ తన తాజా జాబితా విడుదల చేసింది. మస్క్ తన నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయినట్టు ప్రకటించింది.

టెస్లా కంపెనీ షేర్లు విలువ తాజాగా పతనమైంది. షేర్ విలువ 7.2 శాతం క్షీణించింది. దీనికితోడు ఎక్స్ (ట్విట్టర్) కూడా ఇంకా ఊపందుకోలేదు. దీంతో మస్క్ సంపద 197.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. అదే టైమ్ లో బెజోస్ ఆదాయం 200.3 బిలియన్ డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దీంతో బెజోస్ అగ్రస్థానానికి ఎగబాకినట్టయింది.

దాదాపు 9 నెలలుగా అగ్రస్థానంలో కొనసాగాడు మస్క్. అంతకంటే ముందు తన మాజీ భార్యకు కొంత సంపాదనను కోల్పోవాల్సి రావడంతో బెజోస్ ర్యాంకింగ్ లో వెనకబడ్డాడు.

ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్డ్ (197 బిలిన్ డాలర్లు), నాలుగో స్థానంలో మార్క్ జుకర్ బర్గ్ (179 బిలియన్ డాలర్లు), ఐదో స్థానంలో బిల్ గేట్స్ (150 బిలియన్ డాలర్లు) కొనసాగుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?