వీర లెవెల్ హడావుడి చేసి, అతిరధ మహారధులను రప్పించి క్లాప్ కొట్టిస్తే అంతా ఏదో అనుకున్నారు. మరో బలమైన కొత్త బ్యానర్ టాలీవుడ్‌లో అడుగు పెట్టిందనుకున్నారు. కానీ తరువాత మూడు నాలుగు రోజులకే అసలు విషయం బయటకు వచ్చింది.
సినిమాకు ఫైనాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు అన్న వార్తలు వచ్చి. సరే సినిమా అన్నాక ఫైనాన్స్ లేకుండా వుంటుందా అని సరిపెట్టుకున్నారు. కానీ అచిరకాలంలోనే ఈ సినిమా రెండు అడుగులు ముందుకు, మూడు అడుగులు పడడం మొదలైంది. ఆ సినిమానే గోపీచంద్-శ్రీను వైట్ల కాంబినేషన్ సినిమా.
గోపీచంద్ హిట్ అనేది చూసి చాలా అంటే చాలా కాలం అయింది. శ్రీను వైట్ల సినిమా డైరెక్ట్ చేసి చాలా కాలం అయింది. ఇప్పుడు ఈ సినిమా పీపుల్స్ మీడియా మెట్లు ఎక్కింది. ఏడు నుంచి ఎనిమిది కోట్లు ఇప్పటి వరకు ఖర్చయింది. సినిమాలో వాటా తీసుకుంటారా? అంటూ. కానీ దానికి వారి నుంచి వాటా అంటూ వుండదు. సినిమా ఇచ్చేయండి తీసుకుంటాం.. అమౌంట్ లెక్కలు సెటిల్ చేసుకుందాం అంటూ అన్నారని వినిపిస్తోంది.
సినిమా నిర్మాణంలో ఇద్దరు భాగస్వాములు వున్నారు. ఒకరు వాటా అంటున్నారు. ఒకరు ఇచ్చేస్తాం తీసుకోండి అంటున్నారు. దాంతో పీపుల్స్ మీడియా సైలంట్ అయినట్లు తెలుస్తోంది. మొత్తం మీద గోపీచంద్ చేతిలో వున్న రెండు సినిమాల్లో ఒకటి ఇలా త్రిశంకు స్వర్గంలో అటు ఇటు కాకుండా వుండిపోయింది.