ప్రభాస్ హృదయం మంచిది అంటారు సినిమా జనాలు చాలా మంది. ఎలా? ఎందుకు? అంటే ఇండస్ట్రీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం మిగిలిన హీరోలకు ప్రభాస్ కు వ్యవహార శైలిలో చాలా తేడా వుంది. అవే నిర్మాతల దృష్టిలో ప్రభాస్ ను ఉన్నతంగా నిలుపుతున్నాయి. అది ఎలా అంటే..వివరంగా చెప్పాలి అంటే..
ప్రభాస్ కు రెమ్యూనిరేషన్ ఇస్తే చాలు మరో రూపాయి కూడా అదనంగా ఇవ్వనక్కరలేదట. మిగిలిన హీరోలకు అయితే అలా కాదు. మేకప్ మాన్, మేనేజర్, అసిస్టెంట్లు ఇలా చాలా వుంటాయి వ్యవహారాలు. ప్రభాస్ తన కారులో వస్తారు. మరో కారులో ఆయన మనుషులు వస్తారు. కేరవాన్ ఆయనదే వస్తుంది. కానీ దేనికీ రూపాయి ఇవ్వనక్కర లేేదు.
కానీ వేరే హీరోలు అయితే డ్రయివర్ కు ఇవ్వాలి. స్వంత కేరవాన్ అయినా దానికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. అసిస్టెంట్ లు, మేకప్ మాన్ లకు ఫీజులు వుంటాయి. అదే విధంగా ప్రభాస్ కూర్చోవడానికి టెంట్ కూడా ఆయనదే వస్తుంది. కానీ దానికీ రూపాయి కూడా ఇవ్వనక్కర లేదు. అలాగే ప్రభాస్ ఇంటి నుంచి కేరేజ్ వస్తుంది. కనీసం ఇరవై మంది తినేంత ఫుడ్ అది. ప్రొడక్షన్ కు ఆ స్టార్ హోటల్..ఈ స్టార్ హోటల్..నుంచి ఫుడ్ తెప్పించాలి అనే పరిస్థితి లేదు. అలాగే తన బాడీ డబుల్స్ కి కానీ, తన బౌన్సర్లకు కానీ ప్రభాస్ నే చెల్లిస్తారు. నిర్మాత మీద భారం వేయరు.
మిగిలిన హీరోల పరిస్థితి చూస్తే వేరుగా వుంది. ప్రతి దానికీ నిర్మాతకు ఓచర్ వస్తుంది. ఇదీ అది అని లేరు. హీరో తన కారులో శ్రీనగర్ కాలనీ నుంచి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చినా అయిదు వేలు ఓచర్ నిర్మాతకు వచ్చేస్తుంది. లంచ్ టైమ్ ఫుడ్ ఏం కావాలో, ఎక్కడి నుంచి కావాలో అదే తెప్పించాలి. ఇక మిగిలిన వన్నీ నిర్మాత ఖాతాలోనే.
అందువల్లనే ఫ్రభాస్ గ్రేట్ అనాల్సిందే. మరే ఇతర హీరో ఇలా చేయరు అన్నది ఫిక్స్.