Advertisement

Advertisement


Home > Movies - Movie News

గిల్డ్ పెద్ద పాటించని గిల్డ్ బంద్?

గిల్డ్ పెద్ద పాటించని గిల్డ్ బంద్?

టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే వినిపిస్తోంది. సినిమాల నిర్మాణం ఆపమంటూ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకుంది. ఫిలిం ఛాంబర్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. కానీ ప్రస్తుతం విశాఖలో తమిళ-తెలుగు బై లింగ్వుల్ సినిమా షూట్ జరపడానికి ఏర్పాట్లు చేసారని టాక్ వినిపిస్తోంది. 

ఈ సినిమా నిర్మాత దిల్ రాజు కావడమే ఈ టాక్ కు కారణం. అసలు సినిమా నిర్మాణాల బంద్ ను ప్రేరేపించినది, అందరినీ సమీకరించినదీ దిల్ రాజునే. ఆయన సినిమా షూట్ నే ఆపకపోవడం ఏమిటి అన్నది పాయింట్.

అయితే ఇక్కడ లాజికల్ పాయింట్ వుందట. విజయ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో చేస్తున్న వారసుడు సినిమా తమిళ సినిమా కింద లెక్క అంట. తెలుగు సినిమా కింద రాదంట. అదేంటె బై లింగ్యువల్ సినిమా కదా అంటే కాదు, తెలుగులో డబ్ అయ్యే సినిమా అని సమాధానం వినిపిస్తోంది. 

అందువల్ల తెలుగు సినిమా నిర్మాణాల బంద్ కానీ తమిళ సినిమాల నిర్మాణాలు కాదు కనుక వంశీ పైడిపల్లి-విజయ్-దిల్ రాజు సినిమా బంద్ కేటగిరీలోకి రాదంట. ఈ లెక్కన రామ్ చరణ్-శంకర్ సినిమా కూడా బంద్ కేటగిరీలోకి రాదేమో?

కానీ ఇక్కడ ఇంకో లాజికల్ పాయింట్ కూడా వుంది. నిర్మాణాలు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నది తెలుగు నిర్మాతలు కనుక, తెలుగు నిర్మాతలంటా వారి వారి సినిమాల నిర్మాణాలు బంద్ చేయాలేమో? మొత్తం మీద ఈ మేరకు ఇండస్ట్రీ సర్కిళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గిల్డ్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా డిస్కషన్లు సాగుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?