Advertisement

Advertisement


Home > Movies - Movie News

‘గిల్డ్’ నుంచి ‘నాని వెంకట్’ అవుట్

‘గిల్డ్’ నుంచి ‘నాని వెంకట్’ అవుట్

టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ వ్యవహారాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గిల్డ్ సభ్యులుగా ఎవరు అర్హులు అనే డిస్కషన్ ఇప్పుడు మొదలైంది. ఆరంభంలో చాలా మందిని చేర్చుకున్నారు. 

కానీ నిన్నటికి నిన్న హీరోలు నాని, నితిన్, నాగశౌర్యలకు మేనేజర్ గా వుంటూ, వారి సినిమాల ప్రొడక్షన్స్ అన్నీ చూసే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం (నాని వెంకట్) ని నిన్నటికి నిన్న గిల్డ్ సభ్యత్వం నుంచి తొలగించారు. గిల్డ్ వాట్సాప్ గ్రూప్ నుంచి నాని వెంకట్ ను తొలగించడం నిర్మాతల్లో కలకలం రేపింది.

నాని వెంకట్ నిర్మాత కాదు అని అందుకే తొలగించాలని గిల్డ్ కీలక బాధ్యులు చెబుతున్నట్లు తెలుస్తోంది. కానీ దీన్నే కొందరు సభ్యులు నిలదీస్తున్నారు. గిల్డ్ లో నాని వెంకట్ ను చేర్చుకున్నవారే ఇప్పుడు తొలగించారని, అప్పుడు లేని నిబంధన ఇప్పుడు వచ్చిందా అని అంటున్నారు. హీరో నాని తన సినిమా దసరా, అలాగే తను నిర్మిస్తున్న హిట్ 2 సినిమాల షూటింగ్ లు చేయాలని వత్తిడి చేస్తున్నందునే ఇలా చేసారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే గిల్డ్ లో మరి కొందరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు కూడా సభ్యులుగా వున్నారని, వారిని తొలగించకుండా కేవలం నాని వెంకట్ ను మాత్రమే తొలగించడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. మూడు పెద్ద సంస్థల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు ఇప్పటికీ సభ్యులుగా వున్నారని వారిని ఎలా చేర్చుకున్నారని అంటున్నారు. 

అలాగే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని, నిర్మాతలుగా యాక్టివ్ గా లేని వారు కౌన్సిల్ లో వున్నారనే గిల్డ్ ప్రారంభించారని, మరి ఎప్పుడో జమానా కాలం నాడు ఒక్కటి అర సినిమాలు చేసిన వారిని సభ్యులుగా ఎలా వుంచారని ఓ నిర్మాత ప్రశ్నించారు.

తనను సభ్యునిగా తీసుకోమని తాను అడగలేదని, ఇప్పుడు తీసేసినా తనకేం బాధలేదని నాని వెంకట్ వ్యాఖ్యానించడం విశేషం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?