Advertisement

Advertisement


Home > Movies - Movie News

శాకుంతలం సినిమా పుట్టుక అలా జరిగింది!

శాకుంతలం సినిమా పుట్టుక అలా జరిగింది!

కొన్ని కథలు గమ్మత్తుగా పుడతాయి. ఏదో అనుకొని మొదలుపెడితే, మరో ప్రాజెక్టు కింద అది రూపాంతరం చెందుతుంది. శాకుంతలం సినిమా కూడా అలానే పుట్టింది. ఈ సినిమా వెనక జరిగిన కథను బయటపెట్టాడు దర్శకుడు గుణశేఖర్. ఓ సినిమా ఆగడం వల్ల, ఈ సినిమా పుట్టిందని చెప్పుకొచ్చాడు.

"హిరణ్యకశ్యప సినిమా కోసం దాదాపు రెండేళ్లు స్క్రిప్ట్ మీద, మరో మూడేళ్లు ప్రీ-ప్రొడక్షన్ మీద కూర్చున్నాను. ఇక సెట్స్ పైకి వెళ్లాల్సిన స్టేజ్ లో కరోనా వచ్చింది. దాంతో ఆ సినిమా హోల్డ్ లో పడింది. కరోనా తర్వాత హిరణ్యకశ్యపను మళ్లీ సెట్స్ పైకి తీసుకురావాలంటే చాలా టైమ్ పడుతుంది. అందుకే ఈ గ్యాప్ లో వేరే సబ్జెక్ట్ చేయాలనుకున్నాను. అలా శాకుంతలం వచ్చింది."

నిజానికి సోషల్ సబ్జెక్ట్ లో మంచి లవ్ స్టోరీ చేయాలనుకున్నాడట గుణశేఖర్. అలా ప్రేమకథ చేయాలనుకునే క్రమంలో పురాణంలో ప్రేమకథలు చదవడం మొదలుపెట్టాడట. అలా శకుంతల-దుష్యంతుల లవ్ స్టోరీ గుణశేఖర్ ను ఆకర్షించింది.

అయితే ఈ పురాణాన్ని సోషలైజ్ చేయడం గుణశేఖర్ కు నచ్చలేదు. ఉన్న కథను ఉన్నట్టుగానే మైథలాజికల్ గా తీయాలని అనుకున్నాడట. అలా పుట్టిన ఆలోచనకు గుణశేఖర్ కూతురు నీలిమ కూడా మద్దతు ఇవ్వడంతో, ప్రాజెక్టు ఓకే అయింది.

ఈ తరానికి శాకుంతల ప్రేమకథ చెప్పడం తన అదృష్టం అంటున్న గుణశేఖర్, ఈ ప్రాజెక్టులోకి సమంత రావడం తనకు మరింత ప్లస్ అయిందని చెప్పుకొచ్చాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?