Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఛాన్స్ ఇస్తే ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా చేస్తా

ఛాన్స్ ఇస్తే ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా చేస్తా

ఈరోజు ఎన్టీఆర్ కొత్త సినిమా లాంఛనంగా మొదలైంది. ఓపెనింగ్ చాలా ఆర్భాటంగా జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్టుగా రాబోతున్న ఈ సినిమాలో నటీనటుల ఎంపిక ఇంకా పూర్తికాలేదు. ఇలాంటి టైమ్ లో ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు హీరో విశ్వక్ సేన్.

తనకు అవకాశం ఇస్తే ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా చేస్తానంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ హీరో, విశ్వక్ సేన్ విలన్ అంటే చూడ్డానికి ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. కాకపోతే కార్యరూపం దాలుస్తుందా లేక విశ్వక్ ఊరికే ఆ ప్రకటన చేశాడా అనేది తేలాల్సి ఉంది.

తాజాగా దాస్ కా ధమ్కీ సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు విశ్వక్ సేన్. ఈ సినిమాలో అతడు ఓ పాత్రలో నెగెటివ్ షేడ్స్ లో కనిపించాడు. అది చూసిన కొంతమంది ఆడియన్స్ విశ్వక్, విలన్ గా కూడా పనికొస్తాడని ఫిక్స్ అయ్యారు. ఇలాంటి టైమ్ లో విశ్వక్, విలన్ గా నటిస్తానని ప్రకటించడం ఆసక్తి రేకెత్తించింది.

అయితే విశ్వక్ ఇచ్చిన ఈ ఆఫర్ అందరికీ కాదు. కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే. ఎన్టీఆర్ కు వీరాభిమాని విశ్వక్ సేన్. కాబట్టి ఆ అభిమానంతో తారక్ సినిమాలో విలన్ గా అవకాశం వస్తే నటిస్తానని ప్రకటించాడు. అంతేతప్ప, మిగతా హీరోల సినిమాల్లో కూడా అతడు విలన్ గా నటిస్తాడని ఆశపడకూడదన్నమాట. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?