ప్రభాస్ సినిమాకు సంబంధించి మరో కాస్టింగ్ కాల్ వచ్చేసింది. సలార్ సినిమాకు సంబంధించి ఇప్పటికే కాస్టింగ్ కాల్ ప్రాసెస్ పూర్తిచేసి, షూటింగ్ కూడా మొదలుపెట్టగా.. ఇప్పుడు నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించి నటీనటులు కావాలంటూ ప్రకటన వచ్చింది. మరీ ముఖ్యంగా జమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వాళ్లకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది.
డాన్స్, జమ్నాస్టిక్స్ తెలిసి, 9-14 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలు కావాలంటూ నాగ్ అశ్విన్ నుంచి ప్రకటన వచ్చింది. దీంతో పాటు.. 20-35 ఏళ్ల మధ్య వయసున్న పురుష మార్షల్ ఆర్టిస్ట్స్ కావాలని కూడా పేర్కొన్నాడు. సో.. ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ కూడా ఉండబోతున్నాయన్నమాట.
సైన్స్-ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఈనెల 26న ఓ అప్ డేట్ రాబోతోంది. ఆ రోజున సినిమాను లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. లేకపోతే కనీసం టైటిల్ అయినా ప్రకటిస్తారు.
ప్రభాస్-దీపిక పదుకోన్ జంటగా రాబోతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నారు. మహానటి సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన డానీ, ఆ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా పనిచేసిన మిక్కీ జే మేయర్.. ప్రభాస్ సినిమాకు కూడా వర్క్ చేయబోతున్నారు.