గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది

నిజానికి ఈ డైలాగ్ అల్లు అర్జున్ ది. అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ చెబుతాడు. కానీ సేమ్ డైలాగ్ ను హన్సిక కూడా రిపీట్ చేస్తోంది. టాలీవుడ్ లో ఎందుకు ఎక్కువగా సినిమాలు చేయడం…

నిజానికి ఈ డైలాగ్ అల్లు అర్జున్ ది. అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ చెబుతాడు. కానీ సేమ్ డైలాగ్ ను హన్సిక కూడా రిపీట్ చేస్తోంది. టాలీవుడ్ లో ఎందుకు ఎక్కువగా సినిమాలు చేయడం లేదనే ప్రశ్నకు తను గ్యాప్ తీసుకోలేదని, దానంతట అదే గ్యాప్ వచ్చిందని చెబుతోంది.

“నాకు తెలియకుండానే తెలుగులో గ్యాప్ వచ్చేసింది. తమిళ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం వల్ల తెలుగు సినిమాలు కొన్ని వదులుకోవాల్సి వచ్చింది. అంతెందుకు తెనాలి రామకృష్ణ సినిమా కూడా ఒక దశలో చేయలేనని అనుకున్నాను. డేట్స్ ఎడ్జెస్ట్ చేయడం చాలా కష్టమైంది. నిజానికి యూనిట్ నా కోసం కొన్ని రోజులు వెయిట్ చేసింది కూడా.”

ఇలా తను తమిళ్ లో బిజీ అవ్వడం వల్లనే తెలుగులో గ్యాప్ వచ్చిందని చెప్పే ప్రయత్నం చేసింది హన్సిక. తెనాలి రామకృష్ణ సినిమాతో మరోసారి తెలుగుతెరపైకొచ్చిన ఈ బ్యూటీ.. ఇకపై గ్యాప్ ఇవ్వనని, ఏడాదికి ఓ సినిమా కచ్చితంగా చేస్తానని అంటోంది.

కానీ నిజం ఏంటంటే.. హన్సిక కోలీవుడ్ లో ఏమంత బిజీగా లేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క సినిమా మాత్రమే రిలీజ్ చేసింది. మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అది ఈ ఏడాది వస్తుందో, వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవుతుందో తెలీదు.

ఆమెకు కోలీవుడ్ నుంచి ఆఫర్లు తగ్గాయి. అందుకే టాలీవుడ్ లో అవకాశాలు వెదుక్కుంటోంది. పైకి మాత్రం గ్యాప్ తీసుకోలేదు, వచ్చిందంటూ కలరింగ్ ఇస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు తగ్గడంతో ఆమె ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ కు కూడా ఓకే చెప్పింది.