సంక్రాంతి బరిలో మరో సినిమా

సంక్రాంతికి ఎన్ని సినిమాలొస్తున్నాయో, ఎన్ని తప్పుకుంటున్నాయో అస్సలు అర్థంకాని పరిస్థితి. ఆల్రెడీ లిస్ట్ లో మహేష్ బాబు గుంటూరు కారం ఉంది. మొన్నటివరకు ఉన్న ప్రభాస్ కల్కి తప్పుకుంది. ఈ మధ్య నాగార్జున కొత్త…

సంక్రాంతికి ఎన్ని సినిమాలొస్తున్నాయో, ఎన్ని తప్పుకుంటున్నాయో అస్సలు అర్థంకాని పరిస్థితి. ఆల్రెడీ లిస్ట్ లో మహేష్ బాబు గుంటూరు కారం ఉంది. మొన్నటివరకు ఉన్న ప్రభాస్ కల్కి తప్పుకుంది. ఈ మధ్య నాగార్జున కొత్త సినిమా 'నా సామిరంగా' చేరింది. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో మూవీ కూడా ఎంటరైంది.

తేజ సజ్జా హీరోగా నటించిన హను-మాన్ సినిమా సంక్రాంతికి షెడ్యూల్ అయింది. వినాయక చవితి సందర్భంగా ఈ మేరకు డేట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.  2024, జనవరి 12 విడుదల. అయితే రిలీజ్ డేట్ ప్రకటించినా ఈ సినిమాపై చాలామందికి డౌన్స్ ఉన్నాయి.

ఎందుకుంటే, హను-మాన్ సినిమాకు విడుదల తేదీలు ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. ఈమధ్య కాలంలో ఎక్కువ సార్లు వాయిదాపడిన సినిమాగా రికార్డ్ సృష్టించింది హను-మాన్ మూవీ. లేదంటే ఈపాటికి ఈ సినిమా వచ్చి 6 నెలలు అయి ఉండేది.

నిజానికి ఈ సినిమాను మీడియం రేంజ్ బడ్జెట్ లోనే తీసుకొద్దాం అనుకున్నారు. అలానే చేశారు కూడా. ఎప్పుడైతే టీజర్ పాన్ ఇండియా లెవెల్లో హిట్టయిందో, వెంటనే ప్లాన్స్ మారిపోయాయి. కొన్ని సన్నివేశాలు రీషూట్ చేశారు, మిగతా భాషల్లోకి డబ్బింగ్ చేస్తున్నారు, గ్రాఫిక్ వర్క్ కూడా పెంచారు.

అందుకే హనుమాన్ సినిమాను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అప్పటికైనా గ్రాఫిక్స్ వర్క్ పూర్తవుతుందని ఆశిద్దాం. ప్రశాంత్ వర్మ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను 11 భాషల్లో విడుదల చేస్తున్నారు.