మెగా చవితి.. అటు మనవరాలు, ఇటు లావణ్య త్రిపాఠి

ఈ ఏడాది మెగా కాంపౌండ్ చవితి సంబరాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. దానికి కారణం రెండు కుటుంబాల్లోకి ఇద్దరు కొత్త వ్యక్తుల రాక. చిరంజీవి కుటుంబంలోకి చరణ్ కూతురు ప్రవేశించగా.. అటు నాగబాబు కుటుంబంలోకి లావణ్య…

ఈ ఏడాది మెగా కాంపౌండ్ చవితి సంబరాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. దానికి కారణం రెండు కుటుంబాల్లోకి ఇద్దరు కొత్త వ్యక్తుల రాక. చిరంజీవి కుటుంబంలోకి చరణ్ కూతురు ప్రవేశించగా.. అటు నాగబాబు కుటుంబంలోకి లావణ్య త్రిపాఠి రాబోతోంది. వీళ్లిద్దరి రాకతో మెగా చవితి సంబరాలు స్పెషల్ గా మారాయి.

మనవరాలితో కలిసి వినాయక చవితి పూజలో పాల్గొన్నారు చిరంజీవి. క్లీంకారతో కలిసి తొలిసారి వినాయకచవితి జరుపుకోవడం ఆనందంగా ఉందంటూ ప్రకటించిన చిరంజీవి, తన ఇంట్లో జరిగిన పూజ ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా ఉన్నారు.

అటు నాగబాబు ఇంటిలో కూడా వినాయక చవితి సంబరాలు స్పెషల్ గా మారాయి. కాబోయే కోడలు లావణ్య త్రిపాఠితో కలిసి ఇంట్లో వినాయక పూజ చేశారు నాగబాబు. పూజ అనంతరం వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠితో నాగబాబు దంపతులు దిగిన ఫోటోను షేర్ చేశారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం పూర్తయింది. ప్రస్తుతం ఈ జంట పెళ్లికి సిద్ధమౌతోంది. తాజాగా ఇద్దరూ కలిసి డిజైనర్ మనీష్ మల్హోత్రా స్టుడియోను సందర్శించారు. పెళ్లికి సంబంధించిన దుస్తుల డిజైన్ పై చర్చించారు. త్వరలోనే వీరు తమ పెళ్లి తేదీని ప్రకటించబోతున్నారు.

అటు అల్లు అర్జున్ కూడా తన ఇంట్లో జరిగిన వినాయకచవితిని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. జాతీయ అవార్డ్ వచ్చిన తర్వాత ఫుల్ జోష్ తో ఉన్న బన్నీ, చవితి సందర్భంగా భార్యతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు.