రెండు వర్గాలుగా చీలిపోయారు కల్ట్ మామా..!

తమన్ నుంచి ఓ సాంగ్ వచ్చిందంటే ట్రోల్స్ కామన్. ఎక్కడో విన్నట్టుందనే బ్యాచ్ ఎప్పుడూ ఉంటుంది. ఈసారి కూడా తమన్ నుంచి సాంగ్ వచ్చింది. అయితే బాగుందనే బ్యాచ్, బాగాలేదనే బ్యాచ్ చెరిసమానంగా ఉన్నారు.…

తమన్ నుంచి ఓ సాంగ్ వచ్చిందంటే ట్రోల్స్ కామన్. ఎక్కడో విన్నట్టుందనే బ్యాచ్ ఎప్పుడూ ఉంటుంది. ఈసారి కూడా తమన్ నుంచి సాంగ్ వచ్చింది. అయితే బాగుందనే బ్యాచ్, బాగాలేదనే బ్యాచ్ చెరిసమానంగా ఉన్నారు. దీనికి కారణం రామ్.

స్కంద సినిమా నుంచి అంతా ఎదురుచూస్తున్న 'కల్ట్ మామ' సాంగ్ వచ్చేసింది. సాంగ్స్ లో ఇదే హైలెట్ అనేలా ప్రమోషన్ చేశారు. అలా అంచనాలు పెంచి రిలీజ్ చేసిన ఈ సాంగ్ బాగాలేదంటున్నారు చాలామంది. ఎప్పట్లానే తమన్, పైపైన కొట్టేసి పాటను మమ అనిపించాడంటున్నారు.

మరికొందరు మాత్రం పాటలో బీట్ బాగుందంటున్నారు. ఇంకొందరు గాడ్ ఫాదర్ లో చిరు-సల్మాన్ సాంగ్ బీట్ ను తలపిస్తోందని పెదవి విరుస్తున్నారు. మరికొందరు బ్రో సినిమాలోని జానవులే సాంగ్ తర్వాత ఇదే చెత్త పాట అంటున్నారు.

రామ్ పోతినేని ఫ్యాన్స్ మాత్రం తమ హీరోను వెనకేసుకొస్తున్నారు. లిరికల్ వీడియోలో రామ్ గెటప్, అతడి మాస్ స్టెప్పులు బాగున్నాయని అంటున్నారు. రామ్ లాంటి ఎనర్జిటిక్ హీరోకు, ఇలాంటి మ్యూజిక్ అయితేనే మంచి డాన్స్ మూమెంట్స్ వస్తాయని చెబుతున్నారు. అయితే మెజారిటీ జనాలకు మాత్రం ఈ సాంగ్ నచ్చలేదు. వినగా వినగా మెల్లగా ఎక్కుతుందనే ఆశ కూడా చాలామందికి లేదు.

గుంటూరు కారం పరిస్థితేంటో..?

ఈ మొత్తం వ్యవహారంలోకి మహేష్ ఫ్యాన్స్ కూడా ఎంటరయ్యారు. స్కంద మ్యూజిక్ తో గుంటూరు కారంపై అంచనాలు పెట్టుకుంటున్నారు మహేష్ అభిమానులు. వీళ్లకు కల్ట్ మామ సాంగ్ నచ్చలేదు. ఈ సాంగే ఇలా ఉందంటే, గుంటూరు కారం కోసం తమన్ ఇంకెలాంటి పాటలిచ్చాడో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూడా రెండు గ్రూపులు తయారయ్యాయి. త్రివిక్రమ్ సినిమా కాబట్టి ఆటోమేటిగ్గా తమన్ నుంచి మంచి సాంగ్స్ వస్తాయని నమ్మకంగా చెబుతున్నారు. ఏదేమైనా కల్ట్ మామ సాంగ్ తో తమన్ పనితీరుపై మరోసారి సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్ మొదలైంది.