ట్రేడ్ టాక్.. స్కందకు లైన్ క్లియర్

గత వారం రిలీజైన సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి. అంతకంటే ముందు రిలీజైన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, జవాన్ సినిమాలకు మరో వారం కలిసొచ్చినట్టయింది. ఇక ఈ శుక్రవారం చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు.…

గత వారం రిలీజైన సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి. అంతకంటే ముందు రిలీజైన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, జవాన్ సినిమాలకు మరో వారం కలిసొచ్చినట్టయింది. ఇక ఈ శుక్రవారం చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. దీంతో మరో 10 రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న స్కంద మూవీకి లైన్ క్లియర్ అయింది.

గత వారం సినిమాల విషయానికొస్తే.. విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ థియేటర్లలోకి వచ్చింది. ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ సినిమా మెప్పించలేకపోయింది. కామెడీ కోసం స్క్రీన్ ప్లేను గందరగోళంగా మార్చేశారు. ఓ దశలో కథను కూడా పక్కన పెట్టేశారు. దీంతో మార్క్ ఆంటోనీ, బాక్సాఫీస్ పై తన మార్క్ చూపించలేకపోయాడు.

ఈ సినిమాతో పాటు రవితేజ నిర్మాతగా తెరకెక్కించిన ఛాంగురే బంగారురాజా సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా రిజల్ట్ కూడా సేమ్ టు సేమ్. ఉడికీ ఉడకని ఈ క్రైమ్ డ్రామాను ప్రేక్షకులు తిరస్కరించారు. ఇక సోదర సోదరీమణులారా, రామన్న యూత్ సినిమాలు కూడా మెప్పించలేకపోయాయి.

సోదర సోదరీమణులారా సినిమా చాలా స్లోగా ఉంది. పైగా బోర్ కొట్టించింది. ఈ సినిమా కోసం మంచి పాయింట్ ఎంచుకున్న మేకర్స్, ఎంగేజింగ్ గా స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయారు. ఇక తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది రామన్న యూత్.

అభయ్ దర్శకత్వంలో, అతడే హీరోగా తెరకెక్కిన రామన్న యూత్ సినిమాలో రూరల్ పాలిటిక్స్ టచ్ చేశారు. పొలిటీషియన్స్ మాయలో పడి యూత్ ఎలా పక్కదోవ తప్పుతోందనే విషయాన్ని చూపించారు. ఓ ఫ్లెక్సీ, కొంతమంది యువకుల జీవితాల్ని ఎలా మార్చిందనే కోణంలో తీసిన ఈ సినిమా అక్కడక్కడ ఆకట్టుకున్నప్పటికీ, హిట్ టాక్ అందుకోలేకపోయింది. బలగం రేంజ్ లో ఈ సినిమా సెన్సేషన్ అవుతుందని భావించిన మేకర్స్ కు నిరాశ తప్పలేదు.

ఇక రాబోయే శుక్రవారం పెద్ద సినిమాలేవీ రిలీజ్ కు లేకపోవడంతో.. మరో 10 రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న స్కంద సినిమాకు లైన్ క్లియర్ అయినట్టయింది. అప్పటికి జవాన్ హవా కూడా తగ్గుతుంది కాబట్టి, తన పాన్ ఇండియా కల నెరవేర్చుకోవడానికి రామ్ పోతినేనికి సరైన సమయం సెట్ అయింది.