సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా వచ్చిన హను-మాన్ పెద్ద విజయం సాధించింది. ఈ ఏడాది సంక్రాంతి విజేత హను-మాన్ సినిమా మాత్రమే. ఇంతింతై వటుడింతై… అన్నట్టు ఈ సినిమా రోజురోజుకు తన పరిథిని పెంచుకుంటూ పోతోంది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో హను-మాన్ ప్రభంజనం కొనసాగుతోంది.
కళ్లముందే ఈ సినిమా 3 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. విడుదలైన 4 రోజుల్లోనే ఈ సినిమా ఈ ఘనత సాధించడం విశేషం. తాజా వసూళ్లతో హను-మాన్ సినిమా టాప్-10 ఎలైట్ క్లబ్ లో చేరింది.
ఓవర్సీస్ టాప్-10లో చేరడం అనేది చాలామంది హీరోల కల. ఎడ్జ్ వరకు వచ్చి క్లబ్ లో చోటు దక్కించుకోలేకపోయిన హీరోలు చాలామంది ఉన్నారు. అలాంటి ప్రతిష్టాత్మక క్లబ్ లోకి 'చిన్న' హీరో తేజ సజ్జ చేరాడు.
అంతేకాదు, మరికొన్ని రోజుల్లో ఇతడు ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సాహో సినిమాల ఓవర్సీస్ గ్రాస్ ను క్రాస్ చేయడం ఖాయం. ఇంకొంచెం కాలం కలిసొస్తే, ఓవర్సీస్ లో భరత్ అనే నేను రికార్డ్ కూడా బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
టాలీవుడ్ కు సంబంధించి ఓవర్సీస్ లో ఆల్ టైమ్ గ్రాసర్స్ లిస్ట్ లో నంబర్-1 స్థానంలో బాహుబలి-2 ఉండగా, ప్రస్తుతానికి టాప్-10లో ఉంది హను-మాన్ ఉంది.
ఓవర్సీస్ టాప్-10 గ్రాసర్స్ (టాలీవుడ్)
బాహుబలి 2 – $ 20 మిలియన్
ఆర్ఆర్ఆర్ – $14.3 మిలియన్
సలార్ – $ 8.9 మిలియన్
బాహుబలి 1 – – $ 8 మిలియన్
అల వైకుంఠపురములో – $ 3.6 మిలియన్
రంగస్థలం – $ 3.5 మిలియన్
భరత్ అనే నేను – $ 3.4 మిలియన్
సాహో – $ 3.2 మిలియన్
ఆదిపురుష్ – $ 3.1 మిలియన్
హను-మాన్ – $ 3 మిలియన్ (ప్రస్తుతానికి..)