దాదాపు 14 సంవత్సరాల కెరీర్, 50కి పైగా సినిమాలు… నేటితో 35 యేళ్ల వయసు నిండింది… కెరీర్ లో కొన్ని సూపర్ హిట్లు, ఇప్పటికీ చేతినిండా సినిమాలు! దక్షిణాదిన జెండా పాతిన ముంబై హీరోయిన్లలో ఒకరు కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ సినిమాలతో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ముంబై పైనా దండయాత్ర చేసి అక్కడా సినిమా అవకాశాలను పొంది ఇప్పటికీ తన కెరీర్ ను బిజీగానే కొనసాగిస్తూ ఉంది కాజల్.
ప్రస్తుతం యువ హీరోల సరసన అవకాశాలు లేవు కానీ, వెటరన్ల సరసన అవకాశాలు వద్దన్నా వరిస్తున్నాయి. చిరంజీవి, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్ల సరసన కాజల్ నటిస్తూ బిజీగా ఉంది. ఏజైన హీరోలకు కాజల్ ఒక ఛాయిస్ గా మారి. మామూలుగా అయితే ఈ పాటికి కాజల్ తట్టాబుట్టా సర్దేయాల్సి వచ్చేది. అయితే ఇదే సమయంలో సౌత్ లో సీనియర్ హీరోలకు తగిన హీరోయిన్ల కొరత రావడంతో.. ఈమెకు అదే వరప్రదంగా మారినట్టుగా ఉంది.
మరోవైపు కాజల్ పెళ్లి ఊహాగానాలూ వినిపిస్తూ ఉన్నాయి. కొన్నేళ్ల కిందటే కాజల్ చెల్లెలు పెళ్లి చేసుకుని సెటిలైంది. కాజల్ కూడా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతుందనే వార్తలు చాలా సార్లు వచ్చాయి. ఆ మధ్య తనకు కాబోయే శ్రీవారితో కలిసి ఫ్యామిలీ సమేతంగా కాజల్ మాల్దీవుల్లో విహరించిందనే వార్తలూవచ్చాయి. ఆ ఫొటోలు వైరల్ గా మారాయి, అయితే అందులో ఎక్కడా కాజల్ కు కాబోయే వ్యక్తి కనిపించలేదు. అటు సినిమాలతో, ఇటు పెళ్లి ఊహాగానాలతో తన అభిమానులను ఊరిస్తూ ఉంది ఈ నటీమణి!