హారిజ్ జయ్ రాజ్-డేంజర్ పిల్ల

నితిన్-శ్రీలీల కాంబినేషన్ లో వక్కంతం వంశీ అందిస్తున్న సినిమా ఎక్స్ ట్రా.. ఆర్డినరీ మాన్. ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీ మొదలైంది. ఫస్ట్ సాంగ్ వచ్చింది. హారిష్ జయ్ రాజ్ టిపికల్ ట్యూన్ లు…

నితిన్-శ్రీలీల కాంబినేషన్ లో వక్కంతం వంశీ అందిస్తున్న సినిమా ఎక్స్ ట్రా.. ఆర్డినరీ మాన్. ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీ మొదలైంది. ఫస్ట్ సాంగ్ వచ్చింది. హారిష్ జయ్ రాజ్ టిపికల్ ట్యూన్ లు తెలుగులో విని కాస్త గ్యాప్ వచ్చింది . 

ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ వచ్చింది. డేంజర్ పిల్లా అనే హుక్ లైన్ తో వచ్చిందీ పాట. ఆర్మాన్ మాలిక్ పాడిన పాట ఇది. కృష్ణ కాంత్ రచన. పాట కొత్తగా వుంది. అలా అని క్యాచీగా లేదు అని అనుకోవడానికి లేదు. ఇన్ స్టాంట్ చార్ట్ బస్టర్ అనీ లేదు.

విన్న కొద్దీ మంచి పాటగా మిగిలే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ట్యూన్ లో వెర్సటాలిటీ వుంది. కచ్చితంగా సినిమాకు ప్లస్సే అవుతుంది. శ్రీలీల, నితిన్ జోడీ బాగుంది, పాట కోసం తీసుకున్న బ్యాక్ గ్రవుండ్ టీమ్, లోకేషన్లు కూడా పాటకు ప్లస్ అయ్యాయి.

నితిన్ ఈ సినిమా మీద చాలా పట్టుదలగా వర్క్ చేస్తున్నారు. ఏ చిన్న లూప్ హోల్ కూడా వదలకుండా స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టారు. అందుకే చాలా టైమ్ తీసుకుని మరీ సినిమాను ముందుకు నడిపిస్తున్నారు. పబ్లిసిటీ కూడా చాలా ముందుగా స్టార్ట్ చేసారు. డిసెంబర్ లో విడుదల కు జూలై నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసారు. ఆగస్టు నుంచి పాటల విడుదల మొదలుపెట్టారు. ఈ సినిమాకు నిర్మాత సుధాకర్ రెడ్డి.