పాలిటిక్స్ వదిలేశాక హుషారు పెరిగిందా ? 

ఆరోగ్యం బాగా లేదన్న కారణంతో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలను వదిలేశాడు. పాతికేళ్లుగా రాజకీయాల్లోకి వస్తా … వస్తా అని అభిమానులను ఊరించి, వారితో కొన్ని సమావేశాలు పెట్టి, వారి అభిప్రాయాలు తెలుసుకొని,…

ఆరోగ్యం బాగా లేదన్న కారణంతో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలను వదిలేశాడు. పాతికేళ్లుగా రాజకీయాల్లోకి వస్తా … వస్తా అని అభిమానులను ఊరించి, వారితో కొన్ని సమావేశాలు పెట్టి, వారి అభిప్రాయాలు తెలుసుకొని, పార్టీ పేరు కూడా ప్రకటించే తేదీ కూడా అనాన్స్ చేసి చివరకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి పార్టీ పెట్టడంలేదన్నాడు. రాజకీయాలకు స్వస్తి చెబుతున్నానని చెప్పాడు.

రాజకీయాల్లోకి ఎంటర్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన నటిస్తున్న చిత్రం అన్నతే. ఆ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతుండగా గుండెపోటు వచ్చింది. రాజకీయాల్లోకి పోవొద్దని కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి కూడా వచ్చింది. 70 ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి పోవడం మంచిది కాదని, రాజకీయాల్లో చాలా టెంక్షన్ గా ఉంటుందని డాక్టర్లు కూడా చెప్పారు. 

కేవలం ఆరోగ్య కారణాలే కాకుండా మరికొన్ని ఒత్తిడులు కూడా వచ్చాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలా రాజకీయ కథ బిగించిన రజనీ మొత్తం మీద అన్నాతే షూటింగ్ పూర్తి చేశాడు. దీంతో రజనీకి ఎక్కడలేని సంతోషం కలిగింది. 

వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లుగా ఉంది. తనకు ఇంకా మరికొన్ని చిత్రాల్లో నటించాలని ఉందని అన్నాడు. ఆ దేవుడు తనకు శక్తి ఇస్తే నటిస్తానని అన్నాడు. ఆయన సంకల్పం నెరవేరాలని కోరుకుందాం.

ఇక కమలహాసన్ మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోగానే ఆయన కూడా రజనీ బాటలోనే నడుస్తాడని వార్తలు వచ్చాయి. ఆయన పార్టీ నుంచి కొందరు నాయకులు కూడా వెళ్లిపోయారు. దీంతో కమల్ నిరాశలో ఉన్నాడని మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ తాజాగా కమలహాసన్ రాజకీయాలను వదిలేది లేదని ప్రకటించాడు. తన కోన ఊపిరి వరకు రాజకీయాల్లో ఉంటానన్నాడు.