హెబ్బా పటేల్ ‘ధూం ధాం’

గతంలో రెండు మూడు సినిమాలు చేసిన వైజాగ్ కుర్రాడు చేతన్ కృష్ణ హీరోగా , హెబ్బా పటేల్ హీరోయిన్గా ఓ సినిమా రెడీ అయింది. ఈ సినిమా టైటిల్ “ధూం ధాం”. హీరో హీరోయిన్లు…

గతంలో రెండు మూడు సినిమాలు చేసిన వైజాగ్ కుర్రాడు చేతన్ కృష్ణ హీరోగా , హెబ్బా పటేల్ హీరోయిన్గా ఓ సినిమా రెడీ అయింది. ఈ సినిమా టైటిల్ “ధూం ధాం”. హీరో హీరోయిన్లు చిన్నవారే అయినా, ప్యాడింగ్ మాత్రం గట్టగా పెట్టారు.

సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బ్యాకెండ్ ప్యాడింగ్ కూడా గట్టిగా వుంది. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. రామ్ జోగయ్య పాటలు, గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు.

“ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిశోర్ మచ్చ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా ఈ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఇవాళ “ధూం ధాం” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ టీమ్ ఆన్ లొకేషన్ లో రిలీజ్ చేశారు. పెళ్లి బారాత్ లో హీరో హీరోయిన్స్ హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ గా విడుదల చేశారు. కలర్ ఫుల్ గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఓ మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “ధూం ధాం” సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.