ఆర్జీవీ తీసిన కాంటెంపరరీ పొలిటికల్ సెటైరికల్ మూవీ వ్యూహం. దీని సీక్వెల్ శపథం. ఈ సినిమా 8న విడుదల కావాల్సి వుంది. కానీ కావడం లేదు. ఎందుకంటే సెన్సారు 7న కావాల్సి వుంది. సెన్సార్ క్లియరెన్స్ వచ్చినా ఒక్క రోజులో విడుదల అన్నది సాధ్యం కాదు. అందుకే ఓ వారం వెనక్కు వెళ్తుంది విడుదల.
వ్యూహం సినిమాకు సెన్సారు సర్టిఫికెట్ రావడం అన్నది చాలా కష్టమైంది. ముందు సెన్సారు సర్టిఫికెట్ వచ్చినా కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముంబాయ చాలా సార్లు అధికారులు చూసిన తరువాత, చాలా మ్యూట్ లు, కట్ లు తరువాత సర్టిఫికెట్ వచ్చింది. ఇప్పుడు శపథం సినిమా సంగతి చూడాల్సి వుంది.
ఇదిలా వుంటే వ్యూహం సినిమాను ఓటిటి లో పే పెర్ వ్యూ పద్దతిన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఓ పెద్ద ఓటిటి సంస్థతో చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆంధ్రలోని కేబుల్ నెట్ వర్క్ ల ద్వారా కూడా ఈ సినిమాను జనాలకు చేరువ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రోజుకు 100 రూపాయల రేటుకు సినిమా ఆన్ లైన్ లో చూసేలా ఆన్ లైన్ లో అందుబాటులో వుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.