న‌య‌న‌తార‌లో ప్రియుడికి న‌చ్చిన‌వి ఇవే!

ద‌క్షిణాది స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార సినిమాల కంటే, ఆమె వ్య‌క్తిగ‌త జీవితంపైనే ఎక్కువ చర్చ జ‌రిగింది, జ‌రుగుతోంది. న‌య‌న తార‌కు ఇప్ప‌టికే చాలా మందితో అనేక సార్లు ఆమె ప్ర‌మేయం లేకుండానే పెళ్లిళ్లు చేశారు.…

ద‌క్షిణాది స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార సినిమాల కంటే, ఆమె వ్య‌క్తిగ‌త జీవితంపైనే ఎక్కువ చర్చ జ‌రిగింది, జ‌రుగుతోంది. న‌య‌న తార‌కు ఇప్ప‌టికే చాలా మందితో అనేక సార్లు ఆమె ప్ర‌మేయం లేకుండానే పెళ్లిళ్లు చేశారు. మ‌రి ఊహాగానాల‌కు చెక్ పెట్టేలా అస‌లు పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. కొంత కాలంగా న‌య‌న‌తారం-విఘ్నేష్ శివ‌న్ జంట స‌హ‌జీవ‌నం చేస్తోంది.

నేడో, రేపో ఈ ప్రేమ జంట పెళ్లి పీట‌లెక్క‌నుందంటూ చాలా కాలంగా వింటూ ఉన్నాం. ఈ జంట పెళ్లి ఓ సీరియ‌ల్‌ని త‌ల‌పిస్తోంది. వీళ్ల పెళ్లి జ‌రిగితే మాత్రం సంచ‌ల‌నాల కోసం మీడియా కొత్త జంటను వెతుక్కోవాల్సి ఉంటుంది. లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో ఈ జంట ఇంటికే ప‌రిమిత‌మైంది.

ఈ నేప‌థ్యంలో విఘ్నేష్ సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌టించాడు. నెటిజ‌న్స్ అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానాలు చెప్పాడు. నయనతారతో మీరు దిగిన ఫొటో, అందులో మీకు బాగా నచ్చినది ఏది అని ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించాడు. దీనికి స‌మాధానంగా త‌న‌కు న‌చ్చిన ఫొటోను షేర్ చేశాడు.  

అలాగే మ‌రో నెటిజ‌న్ నయన్‌లో మీకు బాగా న‌చ్చిన ల‌క్ష‌ణం ఏంటి? అని అడిగాడు. దీనికి విఘ్నేష్ స్పందిస్తూ …  న‌య‌న‌తారలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని విఘ్నేష్  చెప్పుకొచ్చాడు. న‌య‌న్‌తో క‌లిసి దిగిన ఫొటో, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ త‌న‌కిష్ట‌మ‌ని చేసిన కామెంట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.