తెలంగాణ సినిమా థియేటర్ల అసోసియేషన్ నుంచి అపాలజీ లెటర్ విడుదలయింది. లవ్ స్టోరీ-టక్ జగదీష్ విడుదలల నడుమ నెలకొన్న వివాదం పూర్వాపరాలు క్లుప్తంగా వివరిస్తూ, ఈ నేపథ్యంలో ఎవరైనా ఎగ్జిబిటర్లు వారి వారి వ్యక్తిగత హోదాలో ఎవరినైనా ఘాటుగా విమర్శించి వుంటే క్షమించాలి అంటూ అపాలజీ లెటర్ ను విడుదల చేసారు.
హీరో నాని మీద కొందరు ఘాటు విమర్శలు చేయడం పట్ల ఇండస్ట్రీ నలుమూలల నుంచీ విమర్శలు వినిపించడం ప్రారంభమైంది. పైగా లవ్ స్టోరీ నిర్మాత సునీల్ నారంగ్ ఎటువంటి విమర్శలు చేయకపోయినా, ఇవన్నీ వెళ్లి ఆయన ఖాతాలో పడే ప్రమాదం కనిపించింది.
నిజానికి ఆసియన్ సునీల్ తన ప్రసంగంలో హీరోల గురించి కానీ నాని గురించి కానీ విమర్శలు చేయలేదు. కానీ కొందరు ముందుకు వెళ్లి నాని సినిమాలను థియేటర్ల నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసారు.
ఇది ఇండస్ట్రీలో విమర్శలకు దారి తీసింది. దాంతో ఆసియన్ సునీల్ డ్యామేజ్ కంట్రోలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేసారు.