హీరో నాని..హోమాలే హోమాలు

హీరో నాని ఫుల్ ఫ్రస్టేషన్ లో వున్నాడు. ఇంట్లో వాళ్లు అతగాడి చేత హోమాల మీద హోమాలు చేయించేస్తున్నారు. కూర్చుంటే హోమం, నిల్చుంటే హొమం, బయటకు వెళ్తే గండం, ఇంట్లో వుంటే గండం అంటూ…

హీరో నాని ఫుల్ ఫ్రస్టేషన్ లో వున్నాడు. ఇంట్లో వాళ్లు అతగాడి చేత హోమాల మీద హోమాలు చేయించేస్తున్నారు. కూర్చుంటే హోమం, నిల్చుంటే హొమం, బయటకు వెళ్తే గండం, ఇంట్లో వుంటే గండం అంటూ కారణాలు చెప్పి, హోమాల మీద హోమాలు చేయిస్తున్నారంటూ తెగ రుసరుసలాడుతున్నాడు.

అయితే ఇదంతా సినిమాలో. మైత్రీ మూవీస్ కోసం చేస్తున్న అంటే సుందరానికి సినిమాలో నాని ఫక్తు బ్రాహ్మిన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. నాని బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ వదిలారు. 

పక్కా బ్రాహ్మణ వేష ధారణలో వున్న నాని, ఇంట్లో వాళ్లు చేయిస్తున్న హోమాల తంతు మీద తిట్టుకుంటున్న వైనం ఆ గ్లింప్స్ లో వుంది.

వివేక్ ఆత్రేయ కథ, దర్శకత్వంలో తయారవుతున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. నాని సరనస నజ‌రియా ఫాహిద్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెకు ఇది తొలి తెలుగు సినిమా. ఈ సమ్మర్ లోనే అంటే సుందరానికి సినిమా విడుదలవుతుంది.