తమిళ నటి గాయత్రి సాయినాథ్ ఇంట్లో 111 గ్రాముల బంగారం మాయమైంది. ఆ బంగారాన్ని ఆమె ఇంట్లో పనిచేస్తున్న నర్సు అపహరించినట్టు తేలింది. దీంతో సదరు నర్సును పోలీసులు కటకటాల పాలు చేశారు.
చెన్నై రాయపేటలోని లయడ్స్ రోడ్డు వీధిలో నటి గాయత్రి సాయినాథ్ తన తల్లితో కలిసి ఉంటున్నారు. తల్లి వృద్ధాప్య సమస్య లతో బాధపడుతోంది. దీంతో తల్లికి సపర్యలు చేసేందుకు నగరంలోని ఓ నర్సును నియమించుకుంది. ఈ నేపథ్యంలో తన ఇంట్లో 111 గ్రాముల బంగారం చోరీకి గురి కావడాన్ని నటి గాయత్రి గుర్తించారు. రాయపేట పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.
నటి ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్ చార్లెస్ ఆధ్వర్యంలో సబ్ ఇన్‌స్పెక్టర్ రవిచంద్ర, పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. గాయత్రి నివాసంతో పాటు సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పోలీసు బృందం క్షుణ్ణంగా పరిశీలించింది.
అనంతరం నటి ఇంట్లో పనిచేస్తున్న నర్సు బంగారాన్ని చోరీ చేసినట్టు తేల్చారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారాన్ని తాకట్టు పెట్టినట్టు గుర్తింఆచరు. తాకట్టు పెట్టిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని గాయత్రికి అందజేశారు.